Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Jr NTR: యంగ్ టైగర్ – కొరటాల సినిమా … స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో అదరగొట్టిన తారక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాదు అంతులేని క్రేజ్ ను కూడా సొంతం తెచ్చుకున్నాడు తారక్.

Happy Birthday Jr NTR: యంగ్ టైగర్ - కొరటాల సినిమా ... స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో అదరగొట్టిన తారక్..
Jr Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2021 | 9:33 AM

Happy Birthday Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాదు అంతులేని క్రేజ్ ను కూడా సొంతం తెచ్చుకున్నాడు తారక్. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. తారక్ డాన్స్ కు డైలాగ్ డెలివరీకి నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తారక్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఈ  సినిమాతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు తారక్.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అని తెలిసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే కొరటాల బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ లుక్ పై కూడా ఆయన ఒక క్లారిటీతో ఉన్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల ఆ సినిమా పూర్తయిన వెంటనే తారక్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. నేడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివ సినిమాను నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ యంగ్ టైగర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను షేర్ చేసారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో తారక్ అదిరిపోయే లుక్ లో ఫార్మల్ డ్రస్ లో స్లిమ్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక తారక్ కెరియర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.