NTR Birthday RRR Look : ఆర్ఆర్ఆర్ నుంచి యంగ్ టైగర్ లుక్ .. కొమురం భీమ్ గా అదరగొట్టిన తారక్

Happy Birthday Jr. NTR : యంగ్ టైగర్  ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. నటనలో, హావభావాల్లో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

NTR Birthday RRR Look : ఆర్ఆర్ఆర్ నుంచి యంగ్ టైగర్ లుక్ .. కొమురం భీమ్ గా అదరగొట్టిన తారక్
Jr Ntr In Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2021 | 10:30 AM

Happy Birthday Jr NTR: యంగ్ టైగర్  ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. నటనలో, హావభావాల్లో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎలాంటి పాత్రైనా ఇట్టే ఒదిగిపోతారు తారక్. నటనతో , హై ఓల్టేజ్ డాన్స్ లతో , అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అశేషాప్రేక్షకాదరణ పొందారు తారక్. నేడు ఈ యంగ్ టైగర్ పుట్టిన రోజు. తారక్ సినిమాలంటే అభిమానుల్లో సందడే .. అదే ఆయన పుట్టిన రోజు అంటే పండగే. తారక్ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. భారీ కటౌట్స్ , పాలాభిషేకాలు, పూలాభిషేకాలు.. ఆ హంగామా మాములుగా ఉండదు. ప్రస్తుతం తారక్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆరఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమానుంచి ఎన్టీఆర్ టీజర్ ను విడుదల చేసారు రాజమౌళి. ఆ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది.

తాజాగా నేడు యంగ్ టైగర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కొమురం భీమ్ గెటప్ లో తారక్ ను చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. గురి చూసి బల్లెం విసురుతున్న కొమురం భీమ్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . ఈ పోస్టర్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా తోపాటు కొరటాల శివ తో సినిమా చేస్తున్నాడు తారక్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Happy Birthday Jr NTR: యంగ్ టైగర్ – కొరటాల సినిమా … స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో అదరగొట్టిన తారక్..

Mahesh Babu and Trivikram: మహేష్ బాబు సినిమాకోసం భారీ సెట్స్ వేయిస్తున్న గురూజీ..

Prabhas’s Salaar: పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో అందాల చంద్రముఖి.. ఏ పాత్రలో అంటే..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!