AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ అంటే కేవలం ఒక నియోజకవర్గం కాదు.. అది సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. గత ఎన్నికల్లో ఈ గడ్డ మీద సీఎం మమతా బెనర్జీని ఓడించి బీజేపీ నేత సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. నందిగ్రామ్ అంటే ఒక ప్రాంతం కాదు, అది మార్పుకు ప్రతీక అంటూ ధర్మేంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం
Dharmendra Pradhan Meets Bjp Workers In Nandigram
Krishna S
|

Updated on: Mar 29, 2026 | 5:05 PM

Share

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నందిగ్రామ్ ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లోని క్షేత్రస్థాయి కార్యకర్తలతో చర్చలు నిర్వహించిన ధర్మేంద్ర ప్రధాన్.. రాబోయే ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే.. నందిగ్రామ్‌లో మరోసారి కమలం వికసించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మార్పుకు చేతన.. నందిగ్రామ్

ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రసంగంలో నందిగ్రామ్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నందిగ్రామ్ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం లేదా ఒక నియోజకవర్గం మాత్రమే కాదని, అది బెంగాల్ రాజకీయాల్లో మార్పుకు ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ పట్ల, రాష్ట్ర నాయకత్వం పట్ల నందిగ్రామ్ ప్రజలకు ఉన్న విశ్వాసం విడదీయలేనిదని, అది ఎప్పటికీ దృఢంగా ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సువేందు అధికారి సాధించిన విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తుండగా.. గెలుపు కోసం బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది.

Follow Us
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్
చాయ్ తాగేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే..
చాయ్ తాగేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే..
ఇదెక్కడి రికార్డ్ మావా.. ఆ లిస్ట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఛోటా ప్యాకెట్?
ఇదెక్కడి రికార్డ్ మావా.. ఆ లిస్ట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఛోటా ప్యాకెట్?
మీ ఇంటి కుండీలోనే మామిడి చెట్టు..ఇలా పెంచండి..కాయలే కాయలు!
మీ ఇంటి కుండీలోనే మామిడి చెట్టు..ఇలా పెంచండి..కాయలే కాయలు!