AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Prices: కేంద్ర ప్రకటనతో పెద్ద ఊరట.. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత పడుతున్నాయంటే.?

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం ఒకేసారి భారీగా తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల వాహనదారులకు ప్రత్యక్ష బెనిఫిట్ జరగనప్పటికీ.. ఆయిల్ కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సుంకం తగ్గింపు తర్వాత లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎంత డ్యూటీ పడుతుందనేది చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Mar 29, 2026 | 4:56 PM

Share
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, యుద్ద పరిస్థితుల క్రమంలో వాటి రవాణా, సరఫరాకు అంతరాయం కలుగుతున్న క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. నయారా సంస్థ ధరలను పెంచగా.. ఇక పవర్ పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. అలాగే వాణిజ్య డీజిల్ ధరలు కూడా పెరగ్గా.. త్వరలో అన్నీ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

1 / 5
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. గతంలో ఎక్సైజ్ డ్యూటీ రూ.10గా ఉండగా.. ఇప్పుడు రూ.3కు సవరించింది. ఇక డీజిల్‌పై రూ.10 నుంచి సున్నాకు పరిమితం చేసింది. దీంతో ఆయిల్ కంపెనీలకు లాభం జరగనుంది. అయితే ఈ తగ్గింపుతో లీటర్‌పై ఎంత డ్యూటీ తగ్గుతుందనేది చూద్దాం.

2 / 5
లీటర్ పెట్రోల్‌పై కేంద్రం రూ.21.90 కస్టమ్స్ డ్యూటీ విధిస్తుంది. రూ.1.40 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.13 విధిస్తుంది. ఇక రూ.2.50 అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, రోడ్ సెస్ రూ.5 విధిస్తుంది. ఇక తగ్గించిన తర్వాత ఇప్పుడు లీటర్‌పై రూ.11.90 మాత్రమే అవ్వనుంది. దీని వల్ల కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది.

3 / 5
ఇక డీజిల్‌పై రూ.17.80గా ఎక్సైజ్ డ్యూటీ ఉంది. బేసిక్ రూ.1.80, అడిషనల్ ఎక్సైజ్ సుంకం రూ.10, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్‌మెంట్ రూ.4, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్  రూ.2గా ఉంది. అయితే ఇప్పుడు  ఇది రూ.17.80 నుంచి రూ.7.80కి పడిపోయింది. ఇక వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తాయి.

4 / 5
ప్రపంచంలో అత్యంత చౌకైన పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇరాన్. ఇరాన్‌లో పెట్రోల్ అత్యంత చౌకగా లభిస్తుంది. ఇరాన్‌లో ఒక లీటర్ పెట్రోల్ ధర $0.029. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 2.69కి సమానం. ఇరాన్‌లో పెట్రోల్ భారీ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది.

5 / 5
Follow Us