AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

మనందరికీ అందుబాటులో ఉండే సూపర్ ఫుడ్ అరటిపండు. తక్షణ శక్తి కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినేస్తుంటారు. అయితే అమృతంలాంటి ఈ పండును ఖాళీ కడుపుతో తింటే అది మీ గుండెపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? అసలు అరటిపండును ఏ సమయంలో తింటే ఆరోగ్యం? ఖాళీ కడుపుతో తింటే వచ్చే నష్టాలేంటి? అనేది తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 29, 2026 | 4:08 PM

Share
తక్షణ శక్తినిచ్చే పండ్లలో అరటిపండు మొదటి వరుసలో ఉంటుంది. అందుకే చాలా మంది ఉదయం జిమ్‌కు వెళ్లాలన్నా లేదా ఆఫీస్ హడావిడిలో ఆకలి వేసినా వెంటనే అరటిపండు తినేస్తుంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండును చాలా మంది ఖాళీ కడుపుతో తింటారు. ఇలా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఇందులో ఉండే సహజ చక్కెరలు ఖాళీ కడుపుతో తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి, ఆ తర్వాత అంతే వేగంగా తగ్గించేస్తాయి. దీనివల్ల కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా విపరీతమైన అలసట రావడం జరుగుతుంది.

2 / 5
గుండె ఆరోగ్యంపై ప్రభావం: అరటిపండులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో మెగ్నీషియం, కాల్షియంల మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ఉండే ఆమ్ల స్వభావం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.

3 / 5
అరటిపండును నేరుగా ఖాళీ కడుపుతో తినడం కంటే ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండు ముక్కలను పెరుగులో లేదా ఓట్స్‌లో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. అలాగే పండులోని ఆమ్లత్వం తగ్గుతుంది. బాదం లేదా వాల్‌నట్స్‌తో కలిపి తినడం వల్ల శరీరానికి పోషకాలు నెమ్మదిగా అందుతాయి.

4 / 5
బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సరే పరిమితంగా, సరైన సమయంలో తీసుకున్నప్పుడే అది ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి రేపటి నుండి మీ ఉదయం అలవాటులో ఈ చిన్న మార్పు చేసి చూడండి..

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..