AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, ఫిజికల్‌ ఈవెంట్స్ నుంచి మినహాయింపు!

కేంద్ర ప్రభుత్వం మాజీ అగ్నివీరులపై వరాల వర్షం కురిపించింది. నిబంధనల మేరకు నాలుగేళ్ల వ్యవధి పూర్తయిన తర్వాత అగ్నివీరులు విధుల నుంచి తప్పుకోవల్సి ఉంటుంది. అయితే ఇలా అగ్నివీర్‌ కొలువులకు ఎంపికైన అభ్యర్ధుల కోసం కేంద్ర ప్రభత్వం మరో బంపరాఫర్‌ ఇచ్చింది. వీరికి భవిష్యత్తుల్లో ఇచ్చే పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో శారీరక సామర్థ్య పరీక్షలు, వయసు నుంచి మినహాయింపు ఇస్తూ ప్రకటన జారీ చేసింది..

కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, ఫిజికల్‌ ఈవెంట్స్ నుంచి మినహాయింపు!
Ex Agniveers Exempted From Physical Efficiency Test
Srilakshmi C
|

Updated on: Mar 29, 2026 | 10:01 AM

Share

న్యూఢిల్లీ, మార్చి 29: అగ్నిపథ్‌ స్కీ కింద యేటా వేలాడి మంది యువతకు నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన త్రివిధ దళాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వ్యవధి పూర్తయిన తర్వాత అగ్నివీరులు విధుల నుంచి తప్పుకోవల్సి ఉంటుంది. అయితే ఇలా అగ్నివీర్‌ కొలువులకు ఎంపికైన అభ్యర్ధుల కోసం కేంద్ర ప్రభత్వం మరో బంపరాఫర్‌ ఇచ్చింది. వీరికి భవిష్యత్తుల్లో ఇచ్చే పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు, అలాగే గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ పోలీసు నియామకాల్లో 20 శాతం కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేయనున్నారు. సాయుధ దళాల్లో నాలుగేళ్ల పదవీకాలం తర్వాత అగ్నివీర్లను భద్రతా దళాలలోకి చేర్చుకోవాలన్న కేంద్రం ప్రణాళికకు అనుగుణంగా వీరి నియామక విధానాన్ని అధికారికం చేస్తూ ఢిల్లీ పోలీస్ (నియామకాలు, రిక్రూట్‌మెంట్) నిబంధనలు, 1980కి సవరణ చేశారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 27)న అధికారిక ప్రకటన జారీ చేశారు.

రాత పరీక్షలు, శారీరక ప్రమాణాలు సహా నియామక పరీక్షలను నిర్వహించడానికి సంబంధించిన వివరణాత్మక విధానాలను పోలీస్ కమిషనర్ విడిగా మరో ప్రకటన జారీ చేయనున్నారు. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు ప్రస్తుతం 18 నుంచి 25 సంవత్సరాల వరకు నిర్దేశిత గరిష్ట వయోపరిమితి ఉంది. అయితే ఇందులో మాజీ అగ్నివీర్‌లకు మూడేళ్ల వరకు అంటే 28 ఏళ్ల వరకు సడలింపు లభిస్తుంది. అంతేకాకుండా అగ్నివీర్ పథకంలో మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఇచ్చింది. దీనితో వారి గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలకు పొడిగించబడింది. ఈ నియామక ప్రక్రియలో అత్యంత పోటీతత్వ దశ అయిన ఈవెంట్‌ ముఖ్యమైనవి. ఇందులో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నుంచి కూడా మాజీ అగ్నివీర్‌లకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే అభ్యర్థులందరూ తమ నిర్దేశిత శారీరక కొలతలు, వైద్య ప్రమాణాల్లో మార్పులు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

అలాగే ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ నియామకాలలో మాజీ అగ్నివీర్లకు 20 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా అమోదం తెలిపారు. కాగా ఇప్పటి వరకు పోలీసు కానిస్టేబుల్‌ నియామకాల్లో 100 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మాత్రమే నియామకాలు చేపట్టేవారు. తాజా నిర్ణయంతో ఇకపై 80 శాతం మాత్రమే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారా?: కూనంనేని ఆన్సర్ ఇదే
కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారా?: కూనంనేని ఆన్సర్ ఇదే
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి కొత్త రూల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి కొత్త రూల్స్
కళ్లద్దాల వల్ల ముక్కుపై నల్లటి మచ్చలు పడ్డాయా?5రోజుల్లో మాయం చేసే
కళ్లద్దాల వల్ల ముక్కుపై నల్లటి మచ్చలు పడ్డాయా?5రోజుల్లో మాయం చేసే
నైట్ డిన్నర్ తో జాగ్రత్త.. ఆ మిస్టేక్ వల్లే మీ పొట్ట లావైపోతోంది
నైట్ డిన్నర్ తో జాగ్రత్త.. ఆ మిస్టేక్ వల్లే మీ పొట్ట లావైపోతోంది
ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లేటుగా వచ్చాడని డెలివరీ బాయ్‌ను..
ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లేటుగా వచ్చాడని డెలివరీ బాయ్‌ను..
నేను లేకపోతే సినిమా చేయను అనేవారు..
నేను లేకపోతే సినిమా చేయను అనేవారు..
ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు.. ఏ జిల్లాలో వాతవరణం ఎలా ఉండబోతోంది
ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు.. ఏ జిల్లాలో వాతవరణం ఎలా ఉండబోతోంది
ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశాను..
ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశాను..
సంగీత 52వ వార్షికోత్సవ సేల్ - ఆఫర్ల వెల్లువ!
సంగీత 52వ వార్షికోత్సవ సేల్ - ఆఫర్ల వెల్లువ!
ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ముగిసిన సమ్మర్ డిస్కౌంట్..
ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ముగిసిన సమ్మర్ డిస్కౌంట్..