చెరకు రసం తాగితే కామెర్లు వ్యాధి నిజంగానే నయమవుతుందా?

29 March 2026

TV9 Telugu

TV9 Telugu

మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే హాయిగా అనిపిస్తుంది. క్షణాల్లో శరీరం ఉత్తేజితమవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలే అందుకు కారణం. చెరకు రసం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి

TV9 Telugu

చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఖనిజాలుంటాయి. విటమిన్‌-ఎ, బి, సి కూడా ఎక్కువే

TV9 Telugu

ఇది అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్‌ చేస్తుంది. దీనిలోని ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి

TV9 Telugu

మలబద్ధకాన్ని పారదోలుతుంది. క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధకత పెరుగుతుంది. దీంట్లోని ఫ్లేవనాయిడ్స్‌, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్‌ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి

TV9 Telugu

పీచు సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తాగిన వెంటనే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఎంపిక. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

TV9 Telugu

నోటి దుర్వాసనను తగ్గించి దంతసమస్యలను నిర్మూలిస్తుంది. శరీరంలో ప్రొటీన్‌ స్థాయులను పెంచుతుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

TV9 Telugu

కామెర్లు వచ్చినవారికి ఈ రసం మేలు చేస్తుందంటారు. కాలేయం పనితీరును మెరుగుపరిచి అనారోగ్యానికి కారణమైన పదార్థాలను బయటకు పంపుతుంది

TV9 Telugu

చెరకు రసం కాలేయానికి చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సహజ చక్కెరలతోపాటు విటమిన్ సి కూడా కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది