AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి!

ఈ మధ్య కాలంలో యువత ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రుల కన్నీటికి కారణం అవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువతి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad: శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి!
Hyderabad News
Anand T
|

Updated on: Mar 29, 2026 | 4:56 PM

Share

తాను డిప్రెషన్‌లో ఉన్నానని.. తనను శివయ్య పిలుస్తున్నాడని.. తాను ఆయన దగ్గరకు వెళ్తున్నానని లేఖ రాసి ఓ యువతి ఇంటి నుంచి వెళ్లి పోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా నివాసం ఉంటుంది. అయితే రెండ్రోజుల క్రితం సడెన్‌గా యువతి కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఇంట్లో వెతుకుతుండగా తల్లిదండ్రులకు ఒక లేఖ కనిపించింది.

ఆ లేఖలో ఇలా రాసి ఉంది. తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తనను లార్డ్ శివయ్య పిలుస్తున్నాడని.. అందుకే తాను వెళ్లిపోతున్నానని పేర్కొంది. అది చూసి కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు.

అయితే యువతికి గతంలో ఓ యువకుడితో పరిచయం ఉండేదని.. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించరాని తెలుస్తోంది. అప్పటి నుంచి యువతి అతనితో మాట్లాడటం మానేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు స్థానికుల సమాచారంతో బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us