AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santhosham Movie: ‘సంతోషం’ సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సంతోషం సినిమాలో హీరో అక్కినేని నాగార్జున కుమారుడిగా ఓ పిల్లోడు చాలా అద్భుతగా నటించాడు. కళ్లజోడు పెట్టుకుని.. చబ్బీగా, క్యూట్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఆ సంతోషం మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం రండి.

Santhosham Movie: 'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Santosham Movie Child Artist Akshay Batchu
Basha Shek
|

Updated on: May 14, 2026 | 4:19 PM

Share

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సంతోషం ఒకటి. 2002లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చి దాదాపు 24 ఏళ్లు దాటింది. అయినా ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ మార్చకుండా చూసే వారు చాలా మంది ఉన్నారు. అంతలా రిపీట్ వ్యాల్యూ ఉన్న సినిమా ఇది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు దశరథ్ దర్శకత్వం వహించాడు. నాగార్జున సరసన శ్రియా, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ప్రభుదేవా, కే. విశ్వనాథ్, సునీల్, పృథ్వీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా సాగే సంతోషం సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఎన్ని సార్లు విన్నా అసలు బోర్ కొట్టవు. ‘దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా’, ‘నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస’, ‘నే తొలిసారిగా కలగన్నది నిన్ను కదా’, ‘డిరి డిరి డిరిడీ వారెవ్వా’, వంటి పాటలకు ప్రాణం పోశారు ఆర్పీ పట్నాయక్. ఇదిలా ఉంటే సంతోషం సినిమాలో బాగా హైలెట్ గా నిలిచిన పాత్రల్లో నాగార్జున కొడుకు పాత్ర ఒకటి. కళ్లజోడు పెట్టుకుని.. చబ్బీగా, క్యూట్‌గా కనిపించిన ఈ చిన్నోడు తన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఆ పిల్లాడెవరనుకుంటున్నారా?

సంతోషం సినిమాలో నటించిన ఆ ఛైల్డ్ ఆర్టిస్ట్ పేరు అక్షయ్ బచ్చు. ఈ సినిమాలో నటించేనాటికి ఆ పిల్లాడి వయసు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే. అయితే అంతకు ముందే ఓ సినిమాలో ఈ అబ్బాయి నటన చూసిన నాగ్ సంతోషం సినిమాలో తన కొడుకు పాత్ర ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడిగా కూడా ఈ బుడ్డోడే యాక్ట్ చేశాడు. కొన్ని యాడ్స్ లోనూ నటించాడు. ఎంఎస్ ధోనీతో డాబర్ చవ్యన్ ఫ్రాష్, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్, స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్, నెస్లే చాకో స్టిక్, కలర్ స్కెచ్ పెన్నులు వంటి యాడ్స్‌లో నటించాడు అక్షయ్. అయితే మధ్యలో చదువు కోసం కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడీ అబ్బాయి.

ఇవి కూడా చదవండి

అక్షయ్ బచ్చు లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కట్ చేస్తే.. అక్షయ్ బచ్చు ఇప్పుడు బాలీవుడ్ లో బాగా ఫేమస్ పర్సన్. హిందీ సినిమా ఇండస్ట్రీలో దాదాపు డజన్‌కు పైగానే సినిమాలు చేశాడు. బ్లర్, సత్యమేవ జయతే, రుద్ర వంటి సినిమాలు, రాస్ బరీ, ముంబై డైరీస్ వంటి వెబ్ సిరీస్‌ల్లో అక్షయ్ నటన కు మంచి పేరొచ్చింది. అంతేకాదు పలు సీరియల్స్‌లో కూడా నటించాడు బచ్చు. కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గానూ సత్తా చాటుతున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. అలాగే చాలా సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే