AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాయ్ తాగేటప్పుడు ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే.. మీరు తెలుసుకోవాల్సిన నిజాలివే..

భారతీయులకు ఉదయం నిద్రలేవగానే మొదట కావాల్సింది ఒక కప్పు వేడి వేడి టీ. ఆ టీ చుక్క గొంతులో పడితేనే గానీ చాలామందికి రోజూ గడవదు. అయితే టీ తాగడం కంటే.. దానిని ఎప్పుడు తాగుతున్నాం, దేనితో కలిపి తాగుతున్నాం అనేదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు టీ తాగేటప్పుడు తెలియక చేసే ఈ 5 తప్పులు మీ ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉంది.

Krishna S
|

Updated on: Mar 29, 2026 | 4:40 PM

Share
టీ - బిస్కెట్లు: చాలామంది టీతో పాటు బిస్కెట్లు లేదా పఫ్స్ తింటుంటారు. కానీ మైదా పిండితో చేసిన బిస్కెట్లు, టీ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల స్రావం పెరిగి.. విపరీతమైన గ్యాస్, గుండెల్లో మంటకు దారితీస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర వల్ల ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

1 / 5
చక్కెర మహమ్మారి జాగ్రత్త: టీలో ఎక్కువ చక్కెర వేసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది కాలేయంలో కొవ్వు చేరడానికి కారణమవుతుంది. వీలైనంత వరకు చక్కెర తగ్గించి తాగడం లేదా బ్లాక్ టీ కి మారడం ఉత్తమం.

2 / 5
ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా?: ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అలాగే రాత్రి పడుకునే ముందు తాగితే అందులోని కెఫిన్ వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుంది. ఉదయం నిద్రలేవగానే టీ కంటే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

3 / 5
గ్రీన్ టీ అతిగా తాగకండి: బరువు తగ్గాలని గ్రీన్ టీని లీటర్ల కొద్దీ తాగేస్తుంటారు. కానీ గ్రీన్ టీలోని టానిన్లు, మనం తినే ఆహారంలోని ఐరన్ శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

4 / 5
మరీ వేడి టీ వద్దు: పెనం మీద నుంచి దించిన వెంటనే టీని ఆస్వాదించడం వల్ల నాలుక, పెదవులే కాకుండా.. అన్నవాహిక కూడా దెబ్బతింటుంది. ఇది జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది. టీ తాగిన తర్వాత మీ శరీరంలో ఏవైనా అసౌకర్యాలు కలిగితే వెంటనే గమనించండి. ఒకవేళ కడుపులో మంట లేదా గ్యాస్ ఇబ్బంది పెడుతుంటే వారం రోజుల పాటు టీకి దూరంగా ఉండి చూడండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.

5 / 5
Follow Us
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో

వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా

వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది

గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు

'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!

మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..

చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది