భర్తకే భరణం ఇచ్చిన ఏకైక హీరోయిన్.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ రచ్చ..
Rajitha Chanti
Pic credit - Instagram
29 March 2026
సినీరంగంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ 18 ఏళ్లకే పెళ్లి చేసుకుని 20 ఏళ్లకు తల్లైంది ఈ హీరోయిన్.
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత భర్త మధ్యపానం, గృహహింసతో అతడితో విడాకులు తీసుకుంది.
అంతేకాదు.. ఈ అమ్మడు భర్తకే తిరిగి భరణం ఇచ్చింది. అలాగే తన కుమార్తె కోసం తన ఆస్తి మొత్తాన్ని వదలుకోవడానికి రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ టీవీ నటి శ్వేత తివారి. 1998లో రాజా చౌదరీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు పాలక్ తివారీ జన్మించింది.
అయితే రాజా మద్యం అలవాట్లు, గృహహింసను శ్వేత భరించలేకపోయింది. దీంతో దాదాపు ఐదేళ్లపాటు న్యాయపోరాటం చేసి చివరకు అతడితో విడాకులు తీసుకుంది.
రాజా చౌదరితో విడాకుల సెటిల్మెంట్ లో భాగంగా రూ.93 లక్షల విలువైన ఫ్లాట్ ను భర్తకు భరణంగా ఇచ్చిందట. తన కుమార్తె కోసమే ఆస్తిని వదిలేయాలనుకుందట.
తన కూతురు బంగారు భవిష్యత్తు కోసం తన ఆస్తిని సైతం వదులుకుంటానని.. తన సంపాదన మొత్తం తన పిల్లల కోసమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
2013లో అభినవ్ కోహ్లీని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు పుట్టాడు. కొన్నా్ళ్లకు వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్