Haryana Elections: 2లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,100.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..

హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది..

Haryana Elections: 2లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,100.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..
Haryana Elections
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 19, 2024 | 1:56 PM

హర్యానా దంగల్ హీటెక్కిస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆప్ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.. అంతేకాకుండా మాటల తూటాలు పేలుస్తూ హీటెక్కిస్తున్నాయి. హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది.. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లాడ్లీ లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. లాడ్లీ లక్ష్మీ పథకం నుంచి.. అగ్నివీర్ ఉద్యోగాల వరకు ఎన్నో హామీలనిచ్చింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరిట.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం రోహ్‌తక్‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామని.. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తుందని నడ్డా హామీనిచ్చారు.

బీజేపీ మెనిఫెస్టోలో కీల అంశాలు..

లాడ్లీ లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని బీజేపీ హామీనిచ్చింది.

ఖార్‌ఖోడాలో పారిశ్రామిక మోడల్ టౌన్‌షిప్ తరహాలో 10 పారిశ్రామిక నగరాల ఏర్పాటు

హర్‌ ఘర్‌ గృహిణి యోజన కింద రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌

హర్యానాకు చెందిన ప్రతీ అగ్నివీర్‌కు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం.

ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన హర్యానా విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఏదైనా ప్రభుత్వ మెడికల్ లేదా ఇంజినీరింగ్ కాలేజీలో చదవడానికి స్కాలర్‌షిప్‌లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

24 పంటలకు కనీస మద్దతు ధర కల్పన

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల వరకు ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ పేర్కొంది.

ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పింది.

గ్యారెంటీలతో కాంగ్రెస్..

కాగా.. కాంగ్రెస్ పార్టీ సైతం గ్యారెంటీలతో ప్రచారం ముమ్మరం చేసింది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు.. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారాన్ని చేజిక్కించుకున్న  కాంగ్రెస్‌ పార్టీ… అదే తరహాలో హర్యానా ప్రజలకు ఏడు గ్యారంటీలను ఇచ్చింది. ఆప్ కూడా పలు హామీలతో ప్రచారంలో దూసుకెళ్తోంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..