వారి విషయంలో జగన్ తీరు అభినందనీయం: బీజేపీ ఎంపీ
రమణ దీక్షితులు తిరిగి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం చేయడం సంతోషమని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి గుర్జర్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్య అర్చకుల పట్ల జగన్ తీరు అభినందనీయమని ప్రశంసలు కురిపించారు. టీటీడీలో అడిటింగ్ స్వయంగా నిర్వహించాలని ఆయన సూచించారు. టీటీడీ నిధులను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని.. గతంలో ఈ దేశస్థానంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు […]

రమణ దీక్షితులు తిరిగి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం చేయడం సంతోషమని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి గుర్జర్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్య అర్చకుల పట్ల జగన్ తీరు అభినందనీయమని ప్రశంసలు కురిపించారు. టీటీడీలో అడిటింగ్ స్వయంగా నిర్వహించాలని ఆయన సూచించారు. టీటీడీ నిధులను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని.. గతంలో ఈ దేశస్థానంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరగాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. కాగా దేవస్థాన ప్రధానార్చకులుగా రమణ దీక్షితులకు పాలకమండలి తిరిగి అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం జరిగిన పాలక మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు.