Bribe: ఎన్నికల వేళ బీజేపీకి కొత్త టెన్షన్.. ముడుపులతో అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే పుత్రరత్నం.. ఆపై
గుట్టలకొద్దీ లభించిన నగదును అధికారులు లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన బీజేపీకి పెద్ద దెబ్బ.
ఎమ్మెల్యే కొడుకు లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు కర్నాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ లోకాయుక్త అధికారులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఇది షాక్ అని చెప్పొచ్చు. దావణగెరె జిల్లా చన్నగిరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప.. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ – KSDL ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన కుమారుడు ప్రశాంత్ మదల్ తన ఆఫీసులోనే 40 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. క్యాష్ బ్యాగులతో ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు. ఎమ్మెల్యే కొడుకును అదుపులోకి తీసుకున్నారు. క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ తనను లంచం డిమాండ్ చేసినట్లు మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేసే ఓ కాంట్రాక్టర్.. వారం క్రితం లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో ప్రశాంత్‌ను పట్టుకునేందుకు అధికారులు మాటు వేశారు. వల పన్నారు. తన ఆఫీసులోనే కాంట్రాక్టర్ నుంచి 40 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విషయం ఇంతటితో ముగిసిపోలేదు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో కోటి 70లక్షల రూపాయల నగదు గుర్తించారు. అతని ఇంట్లో 8 కోట్ల డబ్బు దొరికింది. బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్.. తన తండ్రి పేరు చెప్పి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని లంచం తీసుకుంటున్నాడని అధికారులు చెప్తున్నారు. KSDL కార్యాలయంలో అతన్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మూడు బ్యాగుల నిండా డబ్బును తరలించారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు గుట్టల కొద్దీ నోట్ల కట్టలు గుర్తించారు. సుమారు రూ. 6 కోట్ల విలువైన నగదు లభించిందని అధికారులు తెలిపారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంట్లో లోకాయుక్త అవినీతి నిరోధక బృందం శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. గుట్టలకొద్దీ లభించిన నగదును అధికారులు లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన బీజేపీకి పెద్ద దెబ్బ.
Karnataka Lokayukta lays trap to catch BJP MLA’s son red handed, accepting bribe of Rs 40 lacs!
Suprise raid by lokayukta at MLA Madal Virupakshappa’s home & office found Rs 8.2 cr. MLA’s son Prashanth Madal arrested with 5 others. BJP MLA calls it conspiracy against his family pic.twitter.com/uhwxbztJsb
— Nabila Jamal (@nabilajamal_) March 3, 2023
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL)కి మాదాల్ విరూపాక్షప్ప చైర్మన్. వారు ప్రసిద్ధ మైసూర్ శాండల్ సబ్బు తయారీదారులు. ఆయన కుమారుడు ప్రశాంత్ మాదాల్. బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. కేఎస్‌డీఎల్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్‌ను లోకాయుక్త అవినీతి నిరోధక శాఖ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో రూ. 1.75 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. మూడు బ్యాగుల్లోని నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
The anti-corruption branch of Lokayukta yesterday arrested Prashanth Maadal, son of BJP MLA Maadal Virupakshappa, while taking a bribe of Rs 40 lakh. Over Rs 1.7 crore in cash recovered from his office. Prashanth Maadal is chief accountant in BWSSB: Karnataka Lokayukta pic.twitter.com/5Blext88i1
— ANI (@ANI) March 3, 2023
సబ్బులు, డిటర్జెంట్ల తయారీకి సంబంధించిన ముడిసరుకు కొనుగోలుకు సంబంధించి 2008 బ్యాచ్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ప్రశాంత్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.80 లక్షలు లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై అంబుడ్స్‌మన్ స్వతంత్ర విచారణ జరుపుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. దావణగెరె జిల్లా చన్నగిరి నుంచి విరూపాక్షప్ప ఎమ్మెల్యే.
ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారు. ఆఫీస్ అకౌంటెంట్ సురేంద్ర మూడో ప్రతివాది. మూడు, నాలుగు, ఐదో నిందితులుగా మోడల్ విరూపాక్షప్ప బంధువు సిద్ధేష్, వారితో పాటు లావాదేవీకి మధ్యవర్తిత్వం వహించారు. కర్ణాటక సోప్స్ అనుబంధ సంస్థ కర్ణాటక అరోమాస్ కంపెనీ ఉద్యోగులు ఆల్బర్ట్ నికోలస్, గంగాధర్ ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..