AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విశ్వాసమే కాదు.. దేశభక్తి సైతం.. ఈ శునకం చేసిన పని తెలిస్తే మీరు సెల్యూట్ చేస్తారు

జంతువులు భావోద్వేగాలకు విలువనిస్తాయనేది నిజం. అయితే వాటికి దేశభక్తిపై అవగాహన ఉందా అనే సందేహం సహజం. ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కూడా జంతువుల దేశభక్తి గురించి గర్వపడతారు. ఓ కుక్క భారత మ్యాప్‌ వద్దకు వచ్చి తన రెండు కాళ్లను పైకెత్తి తల్లి భారతికి నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: విశ్వాసమే కాదు.. దేశభక్తి సైతం.. ఈ శునకం చేసిన పని తెలిస్తే మీరు సెల్యూట్ చేస్తారు
Patriotic Dog
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2023 | 6:50 PM

Share

మన దేశం గురించి మనమందరం గర్విస్తున్నాం. భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ దేశానికి ఏ క్షణంలో ఏ కష్టం వచ్చినా, అది మన స్వంత బాధలానే అనుభవిస్తాం. అదేవిధంగా దేశం గర్వించేలా ఏదైనా గొప్ప పని జరిగినప్పుడు మన ఆనందానికి అవధులుండవు. దేశం గురించి ఏ చిన్న సంతోషకర విషయమైన సరే..మన మనస్సులో ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది. తల్లి, మాతృభూమి అంటే అందరికీ ప్రేమ, గౌరవం. మనిషికి మాత్రమే భావాలు ఉంటాయని, మనిషికి మాత్రమే గొప్ప దేశభక్తి ఉందని మనం అనుకుంటాం. కానీ మా ఊహ తప్పు. మనుషుల కంటే జంతువులు భావోద్వేగాలకు ఎక్కువ ప్రతిస్పందిస్తాయి. అందుకే మూగజవాలది స్వచ్ఛమైన ప్రేమగా చెబుతుంటారు.

జంతువులు భావోద్వేగాలకు విలువనిస్తాయనేది నిజం. అయితే వాటికి దేశభక్తిపై అవగాహన ఉందా అనే సందేహం సహజం. ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కూడా జంతువుల దేశభక్తి గురించి గర్వపడతారు. ఓ కుక్క భారత మ్యాప్‌ వద్దకు వచ్చి తన రెండు కాళ్లను పైకెత్తి తల్లి భారతికి నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఒక కార్యక్రమంలో కొన్ని ఆర్మీ కుక్కలు పాల్గొన్నాయి. అదేవిధంగా భారతదేశం, జర్మనీ, పాకిస్తాన్ వంటి వివిధ దేశాల మ్యాప్‌లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడికి ఒక తెల్ల కుక్కను తీసుకొచ్చారు. ఇది ఇతర దేశాల మ్యాప్‌ని చూసింది. ఆపై భారతదేశం మ్యాప్ దగ్గర కూర్చుని, తన రెండు కాళ్ళను ఎత్తి భారతమాతకు నివాళులర్పిస్తుంది. నోరులేని మూగజీవి, విశ్వాసానికి ప్రతిరూపంగా చెప్పుకునే కుక్కకు దేశభక్తి అందరి హృదయాలను కదిలించింది. ఈ వీడియో మిమ్మల్ని కూడా భావోద్వేగానికి గురి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు 16.2 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌ని పొందింది. 3.8 మిలియన్ లైక్స్, దాదాపు 12 వేలకు పైగా కామెంట్స్‌ వచ్చాయి. ఒక వినియోగదారు ప్రౌడ్ ఆఫ్ ఇండియా అంటూ కామెంట్‌ చేయగా, పలువురు జై హింద్ అంటూ ట్విట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..