Tamil Nadu: తమిళనాడును రెండుగా విభజిస్తాం.. సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ నేత..!
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటూ డీఎంకే సీనియర్ నేత ఎంపీ ఎ. రాజా చేసిన డిమాండ్‌కు బీజేపీ నేతలు..
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటూ డీఎంకే సీనియర్ నేత ఎంపీ ఎ. రాజా చేసిన డిమాండ్‌కు బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్వతంత్ర తమిళనాడు అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే స్వతంత్ర తమిళనాడు అంశాన్ని తెరపైకి తెస్తే, తాము రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తామంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్ర – తెలంగాణ విభజన జరిగినట్టుగానే తమిళనాడు రాష్ట్రాన్ని కూడా రెండుగా విభజిస్తామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన నాగేంద్రన్.. తమిళనాడు రాష్ట్ర విభజనకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ తలుచుకుంటే వెంటనే రాష్ట్ర విభజన జరిగిపోతుందన్నారు. డీఎంకే నేతలు స్వతంత్ర తమిళనాడు కోసం పోరాడితే.. తాము రాష్ట్ర విభజన కోసం పోరాడుతామని ఉద్ఘాటించారు నాగేంద్రన్.
సోమవారం నాడు తమిళనాడులోని పట్టణ, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఎంపీ ఎ. రాజా.. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అలాగే, లాంగ్ లివ్ ఇండియా నినాదానికి డీఎంకే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు బీజేపీ నేతలు.