Watch Video: సొంత ప్రభుత్వంపైనే దండెత్తిన మాజీ సీఎం ఉమాభారతి.. మద్యం షాపుపై దాడి చేసి వార్నింగ్.. వీడియో

BJP Leader Uma Bharti : మాజీ సీఎం, బీజేపీ నాయకులు ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సొంత ప్రభుత్వంపైనే దండెత్తారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించకుంటే..

Watch Video: సొంత ప్రభుత్వంపైనే దండెత్తిన మాజీ సీఎం ఉమాభారతి.. మద్యం షాపుపై దాడి చేసి వార్నింగ్.. వీడియో
Uma Bharti
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 14, 2022 | 9:46 AM

BJP Leader Uma Bharti : మాజీ సీఎం, బీజేపీ నాయకులు ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సొంత ప్రభుత్వంపైనే దండెత్తారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించకుంటే.. పోరాటం తప్పదంటూ చేసి చూపించారు. తాజాగా.. ఉమాభారతి.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ మద్యంషాపుపై అనుచరులతో కలిసి దాడిచేశారు. మద్యం సీసాలపైకి రాళ్లు విసిరి వాటిని ధ్వంసం చేశారు. కాగా.. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ ఉమాభారతి గతంలో శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అది ముగిసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. దీనికి తోడు మద్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించడంపై ఉమాభారతి ఆగ్రహం వ్యక్తంచేస్తూ నేరుగా మద్యం షాపులోకి వెళ్లి రాయితో సీసాలను పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఉమాభారతి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని పేర్కొంటూ ఉమాభారతి జనవరి 15 వరకు గడువు విధించారు. అప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతానని హెచ్చరించారు. అయితే.. దీనిని శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా.. మద్యంపై 10 నుంచి 13 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతోపాటు మద్యం ధరలను మరింత తగ్గించనున్నట్లు ప్రభత్వం తెలిపింది. దేశీయ, విదేశీ లిక్కర్‌ను విక్రయించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉన్న దానికంటే నాలుగు రెట్లు అదనంగా ఇంట్లో లిక్కర్‌ను నిల్వచేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వార్షిక ఆదాయం రూ.కోటికి మించి ఉంటే ఇంటి వద్దే షాప్ ప్రారంభించుకోవచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు విడుదల చేసింది.

తాజాగా మధ్యప్రదేశ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉమాభారి మద్యంషాపులపై దాడికి దిగారు. కాగా, సొంత ప్రభుత్వంపైనే ఉమాభారతి విమర్శలు గుప్పిస్తుండటంతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read;

Viral Photo: ఈ ఫొటోలో ముఖ్యమంత్రి ఉన్నారు.. యూత్ ఐకానిక్ ఈయనే.. గుర్తుపడితే మీరు జీనియస్..

Indian Students: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం..