ముస్లిం వ్యక్తికి తన కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకున్న బీజేపీ నేత.. చివరికి ఏం జరిగిందంటే

తన కుమార్తెను ఓ ముస్లీం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న బీజేపీ నేతకు చుక్కెదురైంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో వెంటనే వివాహాన్ని రద్దు చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరఖాండ్‌లోని పౌరీ గర్వాల్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ యశ్‌పాల్ బెనమ్ తన కుతురుని ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు.

ముస్లిం వ్యక్తికి తన కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకున్న బీజేపీ నేత.. చివరికి ఏం జరిగిందంటే
Wedding
Follow us

|

Updated on: May 22, 2023 | 4:52 AM

తన కుమార్తెను ఓ ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న బీజేపీ నేతకు చుక్కెదురైంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో వెంటనే వివాహాన్ని రద్దు చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరఖాండ్‌లోని పౌరీ గర్వాల్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ యశ్‌పాల్ బెనమ్ తన కుతురుని ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. యపీలోని లక్నో యూనివర్సిటీలో చదివిన ఆమెకు ఆ ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో ఈ జంటకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నెల 28న వారి వివాహం జరగాల్సి ఉంది.

అయితే ఈ క్రమంలో వారి వివాహ పత్రిక ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక బీజేపీ నేత కూతురు ముస్లిం వ్యక్తిని పెళ్లాడటంపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. బీజేపీ అనుకూల వ్యతిరేక వ్యక్తులూ విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఇంతటి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన చివరికి వెనక్కి తగ్గారు. 28న జరగాల్సిన పెళ్లి రద్దయ్యిందని ప్రకటించారు. కూతురి ఆనందం కోసం ఈ పెళ్లి జరిపించాలనుకున్నప్పటికీ ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందని యష్పాల్ తెలిపారు. శుక్రవారం కొందరు స్థానిక ఝండా చౌక వద్ద యష్పాల్ దిష్టి బొమ్మ తగలబెట్టి నిరసనలు కూడా తెలిపారు. ఈ వివాహాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని వీహెచ్‌పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ గౌడ్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు