విద్వేష ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే సీట్లు కట్..

సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడో పర్యాయం గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP).. విపక్ష కూటమికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి జాబితాలో 25-30 శాతం సిట్టింగ్ ఎంపీలను దూరం పెడుతున్నట్టు పార్టీ నాయకత్వం ముందు నుంచే సంకేతాలిచ్చింది.

విద్వేష ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే సీట్లు కట్..
Bjp
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 03, 2024 | 3:19 PM

సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడో పర్యాయం గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP).. విపక్ష కూటమికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి జాబితాలో 25-30 శాతం సిట్టింగ్ ఎంపీలను దూరం పెడుతున్నట్టు పార్టీ నాయకత్వం ముందు నుంచే సంకేతాలిచ్చింది. అందుకు తగ్గట్టుగానే తొలి జాబితాలోని 195 స్థానాల్లో 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు చోటు కల్పించలేదు. మూడు పర్యాయాలు ఎంపీలుగా ఉన్నవారు, వయస్సు పైబడినవారితో పాటు వివాదాస్పద విద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిని పార్టీ దూరం పెట్టి, మిగతా నేతలకు బలమైన సందేశాన్ని పంపింది. హిందుత్వం పేరుతో అతిగా రెచ్చిపోయి విద్వేషాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇలా టికెట్ కోల్పోయినవారిలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలోని సిట్టింగ్ ఎంపీలు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, రమేశ్ బిధూరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎంపీలు పార్లమెంటు లోపల, వెలుపల వారి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచారు. బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ జట్టుకట్టి పోరాడుతున్న వేళ, విమర్శలకు తావులేకుండా అభ్యర్థుల జాబితా తయారుచేయాలని కమలనాథులు భావించారు. అందుకు తగ్గట్టే కొన్ని కఠిన నిర్ణయాలు సైతం తీసుకున్నారు.

ప్రజ్ఞాసింగ్ ఠాకూర్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్థానంలో బీజేపీ అలోక్ శర్మను అభ్యర్థిగా ప్రకటించింది. 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ఫైర్‌బ్రాండ్ నేత గత ఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ వేయడం పెద్ద దుమారాన్ని రేపింది. ఎంపీగా ఉన్న ఐదేళ్లలో ఆమె నిత్యం వివాదాల్లోనే ఉన్నారు. అనారోగ్య కారణాలతో మాలేగావ్ పేలుళ్ల కేసులో బెయిల్‌పై విడుదలైన ప్రజ్ఞా ఠాకూర్ కబడ్డీ ఆడుతూ, గర్బా నృత్యాల్లో హాజరవుతూ కనిపించారు. వీటి సంగతెలా ఉన్నా మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను “దేశభక్తుడు” అని పేర్కొంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టకే భంగం కలిగించేలా చేశాయి. ఈ వ్యాఖ్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. గాంధీజీ లేదా నాథూరామ్ గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణ కోరినప్పటికీ, తాను మాత్రం ఆమెను పూర్తిగా క్షమించలేనని ప్రధాని చెప్పారు. ప్రధాని క్షమించలేదు అనేందుకు ఇప్పుడు ఆమెకు టికెట్ నిరాకరించడమే కారణం. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఓడించిన ఘనత కల్గిన ప్రజ్ఞాసింగ్ చివరకు రెండోసారి టికెట్ అందుకోలేకపోయారు. 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తన “శాపం” కారణంగానే కర్కరే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే కాదు నియోజకవర్గంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో కూడా లేరన్న విమర్శలు ఆమెపై ఉన్నాయి.

పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ

రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకు మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా స్థానికంగా కార్యకర్తల్లో, పార్టీ శ్రేణుల్లో విశేష ఆదరణ, మద్దతు ఉంది. అయినా సరే ఈసారి జాబితాలో చోటు సాధించలేకపోవడానికి కారణం ఆయన వివాదాస్పద రెచ్చగొట్టే వ్యాఖ్యలే. పర్వేష్ వర్మ పేరు జాబితాలో కనిపించకపోవడం ఢిల్లీ బీజేపీ విభాగంలో చాలామందికి ఆశ్చర్యాన్ని కల్గించింది. కానీ 46 ఏళ్ల పర్వేష్ వర్మ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షాహీన్‌బాగ్ నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ఆందోళనకారులను ఒక్క గంటలో తొలగిస్తానని చెప్పారు. 2022లో వర్మ మళ్లీ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఈసారి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. “మీరు వారిని ఎక్కడ చూసినా, వారిని సరిదిద్దాలనుకుంటే, వారిని పూర్తిగా బహిష్కరించడం మాత్రమే ఏకైక పరిష్కారం. మీరు అంగీకరిస్తే మీ చేయి పైకెత్తండి” అంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు బీజేపీ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్ @2047’ అంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు మేత అందించేలా, అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా తమ నేతల వ్యాఖ్యలు, ప్రకటనలు ఉండకూడదని కోరుకుంటోంది. అందుకే బలమైన నేతను సైతం పక్కనపెట్టింది.

ఇవి కూడా చదవండి

రమేష్ బిధూరి

దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి సైతం విద్వేషపూరిత ప్రసంగాల జాబితాలో ఉన్నారు. గత ఏడాది సెప్టెంబరులో లోక్‌సభలో జరిగిన చర్చలో బిధురి అమ్రోహా ఎంపీ డానిష్ అలీని దూషించారు. కించపరిచే వ్యాఖ్యలు కెమెరాకు చిక్కడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఆయ క్షమాపణలు చెప్పినప్పటికీ, అగ్రనాయకత్వం క్షమించలేదు. సీటు కోల్పోయిన ఇతర ప్రముఖ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీల్లో మీనాక్షి లేఖి, డా. హర్షవర్ధన్ కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో దేశ రాజధానిలో ప్రతి సీటును గెలుచుకున్న బీజేపీ ఈసారి విపక్ష కూటమి నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇండి-కూటమి పొత్తుల్లో భాగంగా ఆప్ 4 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ అగ్రనేత దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, న్యాయవాది భాంసురి స్వరాజ్‌ న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. “గెలవగలగడం చాలా ముఖ్యం. చాలా మంది ఎంపీలు, వారి నియోజకవర్గాల్లో ప్రజాదరణ పొందలేదు” అని పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

అయితే ప్రజ్ఞా ఠాకూర్, రమేష్ బిధూరి, పర్వేష్ వర్మ వంటి నేతలు రెచ్చగొట్టే ప్రకటనలతో పార్టీని ఇబ్బంది పెట్టారనడంలో సందేహం లేదు. వారికి టిక్కెట్లు నిరాకరించడం వల్ల ప్రజా జీవితంలో మర్యాద పాటించాలనే సందేశం కూడా ఉంది. గతంలో వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ప్రధాని పలు సందర్భాల్లో పార్టీ నేతలను హెచ్చరించారు. వాటిని పెడచెవిన పెట్టినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్