PM Modi: పూర్తిస్థాయి కేబినెట్‌తో సమావేశమైన ప్రధాని మోదీ.. ఇదే ఫైనల్

రాబోయే వందరోజులు కీలకమని ప్రధాని మోదీ ఈమధ్యే వ్యాఖ్యానించారు. ఇందుకు తగినట్లే రాబోయే వందరోజుల్లో చేయాల్సిన పనులు, వాటి ప్రణాళికలను మంత్రులు, ఈ స్పెషల్‌ కేబినటె్‌ మీటింగ్‌లో ప్రధాని ముందు ఉంచుతారు. అంటే మూడోసారి తాము అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పదేపదే చెబుతున్నారు.

PM Modi: పూర్తిస్థాయి కేబినెట్‌తో సమావేశమైన ప్రధాని మోదీ.. ఇదే ఫైనల్
PM Modi Cabinet Meeting
Follow us

|

Updated on: Mar 03, 2024 | 12:48 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పూర్తిస్థాయి కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం పదిగంటల నుంచి రోజంతా ఈ మీటింగ్‌ సాగుతుందని చెబుతున్నారు. రొటీన్‌ కేబినెట్‌ సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులతోపాటు సహాయ మంత్రులు, ఇండిపెండెంట్‌ హోదా ఉన్న మంత్రులంతా ఈ స్పెషల్‌ మారథాన్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. మోదీ రెండో దఫా సర్కార్‌లో బహుశా, ఇదే చివరి కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం అని చెబుతున్నారు. మంత్రులందరితోపాటు, అన్ని శాఖల కార్యదర్శులు కూడా ఈ ప్రత్యేక కేబినెట్‌ సమావేశానికి హాజరయ్యారు.

ఎన్నికలకు వెళ్లే వ్యూహంపైనే ఈ స్పెషల్‌ కేబినెట్‌ భేటీలో ప్రధాని మోదీ ఫోకస్‌ చేస్తున్నారు. ఈ ఐదేళ్లు, ఇంకా చెప్పాలంటే మొత్తం పదేళ్లలో తాము సాధించిన విజయాలను ప్రధాని మోదీ తమ కేబినట్‌ సహచరులకు వివరిస్తున్నారు. సాధించిన విజయాలతోపాటు, అభివృద్ధి ప్రణాళికలపై ఫోకస్‌ చేశారు. ఇందుకోసం “విజన్‌ ఇండియా -2047” పేరుతో ఒక ప్రజెంటేషన్‌ కూడా ఈ కేబినెట్‌ భేటీలో ఇస్తున్నారు. అంటే 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కావల్సిన ప్రణాళిలను ఈ మీటింగ్‌లో చర్చిస్తున్నారు.

రాబోయే వందరోజులు కీలకమని ప్రధాని మోదీ ఈమధ్యే వ్యాఖ్యానించారు. ఇందుకు తగినట్లే రాబోయే వందరోజుల్లో చేయాల్సిన పనులు, వాటి ప్రణాళికలను మంత్రులు, ఈ స్పెషల్‌ కేబినటె్‌ మీటింగ్‌లో ప్రధాని ముందు ఉంచుతారు. అంటే మూడోసారి తాము అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పదేపదే చెబుతున్నారు. దీనికి తగినట్లే, వందరోజుల ప్రణాళికపై మోదీ ప్రత్యేకదృష్టిపెట్టారు. ఏం చేశామో, ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో అన్నదాన్నే మోదీ అజెండాగా పెట్టుకున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వంలో ఉంటూ తామేం చేస్తున్నామో అన్నది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ముఖ్యమైన ప్రక్రియలో ప్రధాని మోదీ, తన కేబినెట్‌ సహచరులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు