అక్కడ కీలక పాత్ర పోషించిన బీజేపీ.. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ..
24 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆ సీఎం పీఠాన్ని కదిలించింది బీజేపీ. ఒడిశాను 24ఏళ్లపాటు పాలించిన నవీన్ పట్నాయక్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో కొత్త సీఎం ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒడిశాలో నవీన్ పట్నాయ్ శకం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ ఓటమి పాలయ్యింది. ఒడిశాలో తొలసారి కాషాయం జెండా రెపరెపలాండింది. బీజేపీకి అక్కడ 81 సీట్లు లభించాయి. బీజేడీకి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి.

24 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆ సీఎం పీఠాన్ని కదిలించింది బీజేపీ. ఒడిశాను 24ఏళ్లపాటు పాలించిన నవీన్ పట్నాయక్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో కొత్త సీఎం ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒడిశాలో నవీన్ పట్నాయ్ శకం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ ఓటమి పాలయ్యింది. ఒడిశాలో తొలసారి కాషాయం జెండా రెపరెపలాండింది. బీజేపీకి అక్కడ 81 సీట్లు లభించాయి. బీజేడీకి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి. బీజేడీ పగ్గాలను మాజీ ఐఏఎస్ అధికారి పాండ్యన్ చేపడుతారని బీజేపీ చేసిన ప్రచారం బాగా పనిచేసింది. ఒడిశాకు 2000 నుంచి 2024 వరకు ఐదుసార్లు సీఎంగా సేవలందించారు నవీన్ పట్నాయక్. వయోభారం మీద పడినప్పటికి గతంలో ఎన్నడు లేని విధంగా పార్టీ అభ్యర్దుల తరపున ప్రచారం చేశారు. అయినప్పటికి ఆయన పార్టీ ఓడిపోయింది. ఒడిశాకు కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి సీఎం రేసులో ఎవరెవరు ఉన్నారంటే?
ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్న మొదటి పేరు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సంబల్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కాకుంటే ఆ తర్వాత లిస్ట్ ఉంది గిరీశ్ చంద్ర ముర్ము. ఈయన జమ్ముకశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మోదీ ఆఫ్ ఒడిశా’గా పేరు గాంచిన ఎంపీ ప్రతాప్ సారంగి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో బాలాసోర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక చివరగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి బైజయంత్ పాండా కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. మొత్తంగా ఒడిశాలో 24 ఏళ్ల సీఎం పీఠాన్ని బీజేపీ కదిలించి చరిత్ర సృష్టించింది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలదళం సిద్ధమైంది. 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా రానుండడంతో ఆయన ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








