వృద్ధ రైతుకు తీవ్రమైన తలనొప్పి.. ఆస్పత్రి వెళ్లగా.. ముక్కులో ఏముందో చూసి డాక్టర్లు షాక్
జలుబు ఇబ్బంది పెడుతుంది అని మెడికల్ షాప్ దగ్గరకు వెళ్లి.. జలుబు, దగ్గుకు మందు కొని వేసుకున్నాడు రైతు.. రెండు రోజుల తర్వాత జలుబు తగ్గి ఆరోగ్యం మెరుగుపడింది. అయితే 5 రోజుల తర్వాత తీవ్రమైన తలనొప్పి మొదలైంది.. ఎంతగా అంటే నొప్పిని భరించలేక కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తీసుకుని వెళ్ళమని వేడుకునేటంతగా.. దీంతో వెంటనే రైతుని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ వైద్యులు అతని ముక్కులో జలగ ప్రవేశించినట్లు గుర్తించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు ముక్కులో జలగ చేరి నానా ఇబ్బంది పెట్టింది. దీంతో ఆ అన్నాదాత ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. మహానై గ్రామంలో నివసిస్తున్న రైతు జైమన్ యాదవ్ (58) గురువారం తీవ్ర తలనొప్పితో బాధపడ్డాడు. బాధ భరించలేక తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని కుటుంబ సభ్యులకు చెప్పాడు. రైతు మాటలు విన్న కుటుంబ సభ్యులు టెన్షన్‌కు గురయ్యారు. వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. నొప్పితో తల పగిలిపోతోందని రైతు వైద్యులకు చెప్పాడు. ముక్కులోపల ఏదో పాకుతున్నట్లు అనిపిస్తుందని చెప్పాడు. దీంతో వైద్యులు టార్చ్ సహాయంతో వృద్ధుడి ముక్కులో చూడగా.. అక్కడ ఒక జలగ నివాసాన్ని ఏర్పరుచుకున్నట్లు గుర్తించారు. జలగ ముక్కు లోపల బాగా ఇరుక్కుపోయింది. అది కూడా చాలా పెద్ద జలగ. దీంతో రైతు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.
జలగను ముక్కు నుంచి వైద్యులు అతి కష్టం మీద బయటకు తీశారు. దీంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఐదు రోజుల క్రితం పొలంలోని పనికి వెళ్లినట్లు రైతు జైమన్ యాదవ్ తెలిపాడు. అక్కడ చాలా జలగలు ఉంటాయి. బహుశా ఓ జలగ ఆ రైతు ముక్కులోకి ప్రవేశించి ఉండవచ్చు. అయితే ఈ విషయాన్నీ గుర్తించలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా చలిగా అనిపించింది. జలుబు చేసింది అని భావించాడు.
- Old Farmer
5 రోజుల తర్వాత విషయం వెలుగులోకి
జలుబు ఇబ్బంది పెడుతుంది అని మెడికల్ షాప్ దగ్గరకు వెళ్లి.. జలుబు, దగ్గుకు మందు కొని వేసుకున్నాడు రైతు.. రెండు రోజుల తర్వాత జలుబు తగ్గి ఆరోగ్యం మెరుగుపడింది. అయితే 5 రోజుల తర్వాత తీవ్రమైన తలనొప్పి మొదలైంది.. ఎంతగా అంటే నొప్పిని భరించలేక కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తీసుకుని వెళ్ళమని వేడుకునేటంతగా.. దీంతో వెంటనే రైతుని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ వైద్యులు అతని ముక్కులో జలగ ప్రవేశించినట్లు గుర్తించారు. అతని రక్తం పీల్చి ఆ జలగ చాలా పెద్దదైంది. దీంతో జైమన్‌కు ఊపిరి కూడా సరిగా అందలేదు.
పెద్దగా పెరిగి ముక్కులో ఇరుక్కున్న జలగ
రైతు ముక్కులో ఉన్న జలగను బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఎందుకంటే అది పెద్దదై ముక్కులో బాగా ఇరుక్కుపోయింది. కొన్ని రోజులు అజాగ్రత్తగా ఉంటే మరింత ప్రమాదం ఏర్పడేది అని చెప్పారు. ముక్కు నుంచి జలగను తొలగించేందుకు చాలా సమయం పట్టిందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








