AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: వార్నీ టూరిస్ట్‌లను మోసం చేస్తున్న చైనా.. దేశంలో ఎత్తైన నకిలీ జలపాతం.. పైప్స్‌తో నీరు విడుదల

ఒక చైనీస్ వ్లాగర్ జలపాతానికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రపంచంలోని కొన్ని సహజమైనవి కావు. అయినప్పటికీ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు చైనాకి చెందిన యుంటాయ్ జలపాతం చూడండి.. ఇది ఆసియాలోనే ఎత్తైన జలపాతం. దీని ఎత్తు 314 మీటర్లు. అంట ఎత్తు నుంచి నీరు నేలమీదకు జాలువారుతున్న సమయంలో ఇక్కడ భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి ఏటా వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఇదే కారణం.

China:  వార్నీ టూరిస్ట్‌లను మోసం చేస్తున్న చైనా.. దేశంలో ఎత్తైన నకిలీ జలపాతం.. పైప్స్‌తో నీరు విడుదల
Yuntai Water Fall
Surya Kala
|

Updated on: Jun 07, 2024 | 11:21 AM

Share

ప్రకృతి సృష్టించిన అందాలలో జలపాతాలు కూడా ఒకటి. కొండకోనల్లో నుంచి జాలువారే జలపాతాలను చూస్తుంటే దేనికదే భిన్నమైన అనుభూతి కలుగుతుంది. కొన్ని ప్రదేశాలలో నీరు ఎత్తైన శిఖరాల నుండి వస్తే.. కొన్ని ప్రదేశాలలో ఈ ప్రవాహం అడవుల మధ్య పర్వత శిఖరాల నుండి క్రిందికి ప్రవహిస్తుంది. ఇది చాలా ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. ఎప్పుడైనా మానసికంగా ఒత్తిడికి లోనైతే.. మనం జలపాతం దగ్గరకు వెళ్తే చాలు మంచని రిలీఫ్ అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చైనాకు చెందిన నకిలీ జలపాతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది ప్రదర్శనలో చాలా అందంగా ఉంది.

ఒక చైనీస్ వ్లాగర్ జలపాతానికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రపంచంలోని కొన్ని సహజమైనవి కావు. అయినప్పటికీ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు చైనాకి చెందిన యుంటాయ్ జలపాతం చూడండి.. ఇది ఆసియాలోనే ఎత్తైన జలపాతం. దీని ఎత్తు 314 మీటర్లు. అంట ఎత్తు నుంచి నీరు నేలమీదకు జాలువారుతున్న సమయంలో ఇక్కడ భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి ఏటా వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఇదే కారణం.

ఈ జలపాతం వెనుక వాస్తవం ఏమిటంటే ఇటీవల వైరల్ అవుతున్న బ్లాగర్ వీడియోలో అతను యుంటాయ్ జలపాతం గురించి నిజం చెప్పాడు. ఇది నిజంగా అందంగా ఉంది. అయితే ఈ జలపాతం మానవుల సృష్టి. చైనీస్ వ్లాగర్ ఎలాగో జలపాతం పైకి చేరుకుని అక్కడ చూసిన దృశ్యాలను వీడియో తీసి ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. పెద్ద మెటల్ పైపుల ద్వారా జలపాతంలోకి నీటిని ప్రవహింపజేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిని ఫేక్ అని అంటున్నారు. ఎందుకంటే ఇంత అందమైన జలపాతాన్ని మానవుడు సృష్టించాడు అన్న విషయం నమ్మడం కొంచెం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై యుంటాయ్ మౌంటైన్ సీనిక్ ఏరియా స్పందిస్తూ.. ఈ జలపాతం మానవుల సృష్టి అని స్వయంగా చెప్పింది. దీని అందాన్ని మెరుగుపరచడం కోసం పైపుల ద్వారా నీరు సరఫరా చేస్తారు. అంతే కాదు ఇక్కడ నీటి పంపులు, పైపులు ఏర్పాటు చేశామని.. ఇది నిజమైన జలపాత అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ఈ జలపాతానికి సంబంధించిన నిజం తెలుసుకున్న తరువాత ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..