Kidney Stones: నీరు తక్కువ తాగినా.. వీటిని ఎక్కువగా తిన్నా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త..
శరీరంలోని విష వ్యర్థాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా ఫిల్టర్ చేస్తాయి. అయినప్పటికీ తక్కువగా నీరు తీసుకుంటే విషపూరిత వ్యర్థాల సాంద్రత పెరుగుతుంది. అప్పుడు రాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే పరిస్థితి నెలకొంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి. కిడ్నీలో రాళ్లు తెచ్చే నొప్పి, అసౌకర్యం బాధాకరం అని అంటారు.