- Telugu News Photo Gallery Side effects of eating excess guava fruit who should not eat Telugu lifestyle news
Guava Side Effects: ఇలాంటి వారు పొరపాటున కూడా జామపండు తినకూడదు..! లేదంటే అంతే సంగతి..
పేదవాడి ఆపిల్ గా పిలిచే జామ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు దివ్య ఔషధం. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ జామపండును అతిగా తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు జామపండుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వారికి సమస్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, జామ పండు తినకూడని వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jun 07, 2024 | 7:48 AM

జామ ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా జామ పండ్లతో పాటు జామ ఆకులను కూడా తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇది అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది.

జామపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు జామపండు తినకూడదని చెబుతున్నారు. జలుబు, దగ్గు ఉన్నవారు కూడా జామపండు తినకూడదు. ఎందుకంటే ఇది వ్యాధి లక్షణాలను పెంచుతుంది. దీనిని ముఖ్యంగా రాత్రిపూట అస్సలు తినకూడదు.

జామ పండు రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు జామపండును జాగ్రత్తగా తీసుకోవాలి.. ఎక్కువగా తినకూడదు. ఒకవేళ సర్జరీ చేయించుకున్న వారు కూడా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే జామపండు తినాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు జామపండును తీసుకునే ముందు తప్పక డాక్టరును సంప్రదించాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది.

ఇది రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల రక్తస్రావం ఎక్కువ అవుతుంది. జామ ఆకులను తీసుకోవడం వల్ల రక్తహీనత, తలనొప్పి, కిడ్నీ సమస్యలు వస్తాయి. జామపండును ఎక్కువగా తీసుకోవద్దు. జామ పండు అధికంగా తీసుకోవడం వల్ల ఇది మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే సహజ చక్కెర కడుపు ఉబ్బరం సమస్యను కూడా కలిగిస్తుంది.

జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి డయాబెటిక్ రోగులకు జామ ఆకులు ఎలాంటి బెరుకు లేకుండా తినవచ్చు. ఇందులో విటమిన్-సి కాకుండా, జామ ఆకుల్లో యాంటీ అలర్జీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పికి జామ ఆకులు చాలా ఉపయోగపడతాయన్నమాట.




