Bird flu: బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్లను చంపేయాలని అధికారుల నిర్ణయం
మహారాష్ట్రలోని థానే(Thane) లో జిల్లాలో బర్డ్‌ఫ్లూ(Bird Flu) కలకలం రేగింది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ కోళ్లఫారంలో వంద కోళ్లు..
మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ మళ్లీ అలజడి రేపింది. థానే(Thane) జిల్లాలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో దాదాపు వంద కోళ్లు హఠాత్తుగా చనిపోవడంతో హైలర్ట్ ప్రకటించారు. బర్డ్ ఫ్లూ(Bird Flu) కారణంగా షాహాపూర్ తహసీల్‌లోని వెహ్లోలి గ్రామంలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లకు సంబంధించిన నమూనాలను పుణే(Pune)లోని ల్యాబ్‌కు పంపించారు. జిల్లాలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగా కోళ్లు చనిపోయాయని థానే జడ్పీ సీఈవో డా. బహుసాహెబ్ దంగ్డే వెల్లడించారు. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. వైరస్ ప్రబలిన ఆ కోళ్ల ఫారంలోని కోళ్లను చంపేయాలని ఆదేశించారు. అలాగే ప్రభావితమైన పౌల్ట్రీ ఫారమ్ నుంచి కిలోమీటర్ పరిధిలో సుమారు 25,000 కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఆదేశించారు. థానే సరిహద్దు జిల్లాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో గే బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించినట్టు కేంద్ర పశు సంవర్ధక శాఖకు దృష్టికి తీసుకెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించి పరీక్ష కోసం పుణేలోని ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ శాస్త్రీయ నామం ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా. ఇది పక్షుల్లో కనిపించే ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా బాతులు, అడవి నీటి పక్షులకు సోకుతంది. వైరస్ లక్షణాలు కనిపించకుండా అడవి పక్షుల ద్వారా వ్యాపిస్తుందని, ఈకలు లేదా మలం ద్వారా కోళ్లకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్‌లో ప్రతి ఏటా బర్డ్‌ఫ్లూ ఏదో ఓ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలంటున్నారు.
పన్నెండేళ్ల బాలుడు మృతి..
బర్డ్ ఫ్లూ(Bird flu in India)తో గతేడాది జులైలో 12 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో చనిపోయాడు. దీంతో బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌కు వెళ్లారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని వైద్యనిపుణులు వారికి సూచించారు. భారత్‌లో బర్డ్ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి. హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న దిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. దీంతో పరీక్షించిన వైద్యులు మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. అనంతరం నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హర్యానాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది.
Also Read
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. వారి సంగతి ఏంటని సూటి ప్రశ్న!
Maruti Suzuki: మారుతి సుజుకి కారు కొనాలనుకుంటున్నారా..? భారీ ఆఫర్లు..!
Tirumala Laddu: ఇక నుంచి తిరుమల శ్రీవారి లడ్డూకు మరింత రుచి.. ఎందుకో తెలుసా..?