ఫ్లూ అటాక్.. 13 వేల కోళ్లను చంపేయాలని నిర్ణయం

కోజికోడ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాలోని కొడియతూర్, వెంగర గ్రామాల్లో రెండు వారాలుగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు 13 వేల కోళ్లను చంపి పూడ్చిచాలని లేకుంటే కాల్చేయాలని...

ఫ్లూ అటాక్.. 13 వేల కోళ్లను చంపేయాలని నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 10:08 AM

ఇప్పటికే దేశంలో ఓ వైపు కరోనా.. మరో వైపు స్వైన్‌ ప్లూ.. ప్రజలను గడగడలాడిస్తున్నాయి. అలాగే ఏపీ వ్యాప్తంగా ‘రుగోస్ వైరస్’తో పండ్ల తోటలు నాశనమవుతుండగా.. కర్నాటకలో ‘మంకీ వైరస్’ గుబులు పుట్టిస్తోంది. ఇప్పుడు మరో 13 వేళ కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో.. ఆ కోళ్లని చంపేయాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాలోని కొడియతూర్, వెంగర గ్రామాల్లో రెండు వారాలుగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో అనుమానమొచ్చిన.. పౌల్ట్రీ యజమానులు.. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు.. ‘భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్’ సంస్థకు కోళ్ల రక్త నమూనాలను పంపగా.. పరీక్షలు నిర్వహించిన వారు.. వాటికి బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించారు. దీంతో సుమారు 13 వేల కోళ్లను చంపి పూడ్చిచాలని లేకుంటే కాల్చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

ఎందుకంటే.. బర్డ్ ఫ్లూ వ్యాధి తొందరగా.. మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉంది. అందులోనూ ఇది గాలి ద్వారా తొందరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి.. ఈ కోళ్లు బ్రతికి ఉంటే.. ప్రమాదమని గ్రహించిన అధికారులు వీటిని చంపాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ ఫ్లూ గ్రామంలోని పక్షులకు, జంతువులకేమైనా సోకిందా? లేదా అనే టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. నష్టపరిహారం కూడా అందించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రకటించారు.

Read More: ఒట్టేసి చెబుతున్నా.. నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు బతికిలేరు.. నా జాతకమే అంత!