నిర్భయ దోషి ముకేష్‌కి మరో దెబ్బ.. తాజా పిటిషన్ కొట్టివేత

నిర్భయ కేసులో ఓ దోషి అయిన ముకేష్‌కి మరో దెబ్బ.. తన పిటిషన్ ని అత్యవసరంగా సోమవారం విచారించాలంటూ అతగాడు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే దీనిపై ఈ నెల 16 న విచారణ జరపాలని నిర్ణయించింది. తన మెర్సీ పిటిషన్ ని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ లోగడ ముకేష్ దాఖలు చేసిన పిటిషన్ ని కూడా కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జైల్లో తను పడిన బాధలే ఆ పిటిషన్ దాఖలు చేయడానికి […]

నిర్భయ దోషి ముకేష్‌కి మరో దెబ్బ.. తాజా పిటిషన్ కొట్టివేత
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Mar 07, 2020 | 6:10 PM

నిర్భయ కేసులో ఓ దోషి అయిన ముకేష్‌కి మరో దెబ్బ.. తన పిటిషన్ ని అత్యవసరంగా సోమవారం విచారించాలంటూ అతగాడు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే దీనిపై ఈ నెల 16 న విచారణ జరపాలని నిర్ణయించింది. తన మెర్సీ పిటిషన్ ని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ లోగడ ముకేష్ దాఖలు చేసిన పిటిషన్ ని కూడా కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జైల్లో తను పడిన బాధలే ఆ పిటిషన్ దాఖలు చేయడానికి కారణమన్న అతని వాదనను నాడు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిర్భయ కేసులో దోషులు ఇలా తమ ఉరిని జాప్యం చేసేందుకు గల అన్ని మార్గాలనూ వినియోగించుకుంటున్నారు. ఈ దోషులు నలుగురినీ ఈ నెల 20 వ తేదీ తెల్లవారుజామున అయిదున్నర గంటలకు ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu