AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఆసుపత్రి పరిసరాల్లో బైక్ పార్కింగ్ చేశారో ఇక అంతే సంగతులు.. నెత్తి, నోరు బాదుకోవాల్సిందే

ఎంజీఎం ఆస్పత్రి పరిసరాలలో వాహనాలు చోరీలకు బ్రేకులు వేసేందుకు సిబ్బంది తో కలిసి కసరత్తు మొదలు పెట్టారు. వాహనాలు చోరీకి గురవుతున్న ప్రాంతాలను పరిశీలించిన ఆయన ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా లేకపోవడమే చోరీలు ప్రధాన కారణంగా గుర్తించారు.. పోలిస్ సిబ్బందిని, సెక్యూరిటీ గార్డ్స్ ను అలర్ట్ చేశారు.. ఎంజీఎం పరిసరాలన్ని పరిశీలించిన ఆయన కొన్ని సెలెక్టెడ్ పార్కింగ్ ప్లేస్ లను గుర్తించారు. అక్కడే పార్కింగ్ చేసే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు.

Telangana: ఆ ఆసుపత్రి పరిసరాల్లో బైక్ పార్కింగ్ చేశారో ఇక అంతే సంగతులు.. నెత్తి, నోరు బాదుకోవాల్సిందే
Police
Follow us
G Peddeesh Kumar

| Edited By: Aravind B

Updated on: Aug 07, 2023 | 8:32 PM

ఆ పేదల పెద్దాసుపత్రిపై దొంగల కన్ను పడింది. రోగులు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెడుతుంటే. దొంగలు వారి వాహనాలపై కన్నేస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో ఏకంగా వరంగల్ పోలీస్ కమిషనరే రంగంలోకి దిగారు. చోరీలకు బ్రేక్ లు వేసేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగల బెడద విపరీతంగా పెరిగింది. ఒకవైపు సెక్యూరిటీ సిబ్బంది, ఎస్పీఎఫ్, సివిల్ పోలీస్ ఎవరి డ్యూటీ వారు చేస్తుంటే. మరోవైపు దొంగలు కూడా వారి పని వారు చేసుకుబోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను కాపు కాసి మాయం చేస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఎంజీఎంలో వాహనాల చోరీలు, సెల్ ఫోన్ల చోరీ ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో నేరుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ రంగంలోకి దిగారు..

ఎంజీఎం ఆస్పత్రి పరిసరాలలో వాహనాలు చోరీలకు బ్రేకులు వేసేందుకు సిబ్బంది తో కలిసి కసరత్తు మొదలు పెట్టారు. వాహనాలు చోరీకి గురవుతున్న ప్రాంతాలను పరిశీలించిన ఆయన ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా లేకపోవడమే చోరీలు ప్రధాన కారణంగా గుర్తించారు.. పోలిస్ సిబ్బందిని, సెక్యూరిటీ గార్డ్స్ ను అలర్ట్ చేశారు.. ఎంజీఎం పరిసరాలన్ని పరిశీలించిన ఆయన కొన్ని సెలెక్టెడ్ పార్కింగ్ ప్లేస్ లను గుర్తించారు. అక్కడే పార్కింగ్ చేసే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో మాత్రమే కాదు.. చాలా ప్రాంతాల్లో ఈ మధ్య బైక్స్ చోరీలు ఎక్కువయ్యాయి. వివిధ ప్రాంతాల్లో చోరీకి గురవుతున్న వాహనాలు ఎక్కడికి చేరుతున్నాయి..? అవి ఎలా మార్ఫింగ్ జరుగుతున్నాయి..? అనే విషయాలు ఆరా తీసిన సిపి రంగనాథ్ నేరుగా బైక్స్ మార్ఫింగ్ చేసే ఆటోనగర్ కి వెళ్లారు. ఆటో నగర్ లో బైక్స్ మాడిఫై చేసే మెకానిక్ లు, మాడిఫై సెంటర్స్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.

షోరూం నుంచి వచ్చిన బ్యాక్ అయినా… దొంగిలించబడిన వాహనాలైనా అనుమతి లేకుండా మాడిఫై చేస్తే వారిపై కఠినచర్యలు వుంటాయని హెచ్చరికలు జారీ చేశారు.. అప్పటికే మాడిఫై చేస్తున్న కొన్ని వాహనాల కూడా గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. అలాగే సీపీ ఆదేశాలతో నగరంలో బైక్స్ చోరీ లపై ఫోకస్ మమ్మరం చేసిన పోలీసులు.. వానదారులు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రుల వద్ద చోరీ లకు పాల్పడే పాపాత్ములు పెరిగిపోవడంతో వారి తాట తీసేందుకు పోలీసులు నిఘా పెంచారు.

ఇవి కూడా చదవండి