AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంపముంచిన సెల్ఫీ.. పడవ బోల్తా పడి ఆరుగురు పిల్లల గల్లంతు..!

బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైశాలిలో సెల్ఫీ తీసుకుంటూ చెరువులో మునిగి ఆరుగురు పిల్లలు గల్లంతయ్యారు. పిల్లలు ఒక పడవలో వెళ్తూ సెల్పీ తీసుకుంటున్నారు. దీంతో అది కాస్తా బోల్తా పడింది. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని చెరువు నుంచి ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి మునిగిపోయిన పిల్లల కోసం వెతుకుతున్నారు.

కొంపముంచిన సెల్ఫీ.. పడవ బోల్తా పడి ఆరుగురు పిల్లల గల్లంతు..!
Symbolic Image
Balaraju Goud
|

Updated on: Feb 23, 2025 | 9:25 PM

Share

బీహార్‌లో భారీ ప్రమాదం జరిగింది. వైశాలిలో పడవ బోల్తా పడి 6 మంది పిల్లలు చెరువులో మునిగి చనిపోయారు. ఈ సంఘటన వైశాలి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, గజఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను చెరువు నుండి బయటకు తీశారు. కుటుంబ సభ్యులు వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నీటిలో మునిగిపోయిన మిగిలిన పిల్లల కోసం ప్రత్యేక బృందాలు సహాయక కొనసాగిస్తున్నారు.

ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో పిల్లలు బలి అయిన కుటుంబాల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పిల్లలందరూ పడవలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపారు.

వైశాలి జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ టాండ్‌లోని లాల్‌పురా గాంధీ మైదాన్ చెరువు వద్ద ఈ సంఘటన జరిగింది. ఇక్కడ సెల్ఫీ తీసుకుంటూ 6 మంది పిల్లలు నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో, చెరువులో మునిగిపోయిన వారికోసం గాలిస్తున్నారు. కాగా గల్లంతైన వారిని ప్రతాప్ టాండ్ షేర్పూర్ నివాసితులుగా గుర్తించారు. 15 ఏళ్ల ప్రియాంషు కుమార్, 17 ఏళ్ల వికాస్ కుమార్ లను లోతైన నీటి నుండి బయటకు తీశారు. మునిగిపోయిన పిల్లలిద్దరినీ కుటుంబ సభ్యులు వెంటనే సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ సంఘటనకు సంబంధించి భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ శంభు నాథ్ మీడియాకు వివరించారు. చెరువులో పడవపై కూర్చుని ఆరు మంది పిల్లలు సెల్ఫీలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సమయంలో పడవ బోల్తా పడింది. ఇద్దరు పిల్లలను బయటకు తీశారు. సదర్ ఆసుపత్రిలో వారిద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శంభు నాథ్ తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు