PM Modi Viral News: ప్రధాని నరేంద్ర మోదీ మనీ హుండీ.. తయారు చేసిన శిల్ప కళాకారుడు
PM Modi Statues Money Storage Bank : బీహార్‌కు చెందిన ఓ శిల్పకళాకారుడు ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం మనీ స్టోరేజీ బ్యాంకుగా ఉపయోగించుకునేలా..
PM Modi Statues Money Storage Bank : బీహార్‌కు చెందిన ఓ శిల్పకళాకారుడు ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం మనీ స్టోరేజీ బ్యాంకుగా ఉపయోగించుకునేలా రూపొందించాడు. ఈ సందర్భంగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన శిల్పి జై ప్రకాశ్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 22న ప్రధాని నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించినప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేయాలని ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ మనీ స్టోరేజీ బ్యాంకు విగ్రహంలో నగదు నోట్లు, నాణేలు మొత్తం కలిపి లక్ష రూపాయల వరకు స్టోరేజీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విగ్రహం తయారీ వెనుక ప్రధాని నరేంద్రమోదీ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఈ మనీ స్టోరేజీ బ్యాంకు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నరేంద్రమోదీ దేశాన్ని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల ఇబ్బందులను తీర్చడమే కాకుండా కరోనా కాలంలో నష్టపోయిన వారికి, అలాగే కరోనాను కట్టడి చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని, మోదీ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. ఈ మోదీ విగ్రహాలను తయారు చేసిన జై ప్రకాశ్.. మార్కెట్లో విక్రయించడం ప్రారంభించాడు. ఇలా దేశాన్ని రక్షించేందుకు చేస్తున్న మోదీ విగ్రహాలను తయారు చేసి అమ్మడం వల్ల ఆర్థికంగా ఉపయోగపడుతుందని అంటున్నాడు. ఈ మనీ బ్యాంక్ స్టోరేజీ విగ్రహం తయారు చేసేందుకు నెల రోజుల సమయం పట్టిందని అన్నారు.
కాగా, ఇలా మోదీ విగ్రహాలు తయారు చేయడం ఇది కొత్తేమి కాదు. 2017లో ఓ అభిమాని 100 అడుగుల విగ్రహంతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 23న నిర్మాణం ప్రారంభానికి భూమి పూజ చేయనున్నారు. అంతేకాదు మోదీ మైనపు విగ్రహాన్ని 2016లో లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియంలో ఆవిష్కరించారు.
Bihar: Muzaffarpur-based sculptor Jai Prakash carved statue of PM Narendra Modi to be used as money storage bank
I got idea of making this when PM announced Janata Curfew last year. He has been making efforts to save country. I decided to make it to save money:He said y’day(1/2) pic.twitter.com/iKTzwUUgLJ
— ANI (@ANI) July 13, 2021