Triple Murder: పాల బాకాయి కోసం రక్తపాతం.. రూ.400 కోసం ముగ్గురు హత్య, ఒకరికి గాయాలు
గురువారం అర్థరాత్రి సుర్గా గ్రామంలో పాల డబ్బును డిమాండ్ చేస్తూ రెండు పార్టీలు ఘర్షణకు దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవ చిలికి చిలికి గాలి వాన అయినట్లు తీవ్రస్థాయికి చేరడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను శైలేష్ సింగ్, జై సింగ్, ప్రదీప్ సింగ్‌లుగా గుర్తించారు. క్షతగాత్రుడు 22 ఏళ్ల యువకుడు మింటస్ కుమార్ గా గుర్తించారు. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పాట్నాలోని ఎన్‌ఎంసిహెచ్‌లో చేర్చారు.

డబ్భుల లావాదేవీల్లో వచ్చిన తేడాతో ఏకంగా హత్య చేసే వరకూ వెళ్ళింది. పాల డబ్బుల కోసం రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ దారుణ ఘటన బీహార్ రాజధానిలో చోటు చేసుకుంది. పాట్నా సమీపంలోని ఫతుహాలో డబ్బు లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలోని సురంగపర్ గ్రామంలో పాల డబ్బుల వివాదంపై భీకర కాల్పులు జరిగాయి. నలుగురిపై కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను శైలేష్ సింగ్, జై సింగ్, ప్రదీప్ సింగ్‌లుగా గుర్తించారు. క్షతగాత్రుడు 22 ఏళ్ల యువకుడు మింటస్ కుమార్ గా గుర్తించారు. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పాట్నాలోని ఎన్‌ఎంసిహెచ్‌లో చేర్చారు.
గురువారం అర్థరాత్రి సుర్గా గ్రామంలో పాల డబ్బును డిమాండ్ చేస్తూ రెండు పార్టీలు ఘర్షణకు దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవ చిలికి చిలికి గాలి వాన అయినట్లు తీవ్రస్థాయికి చేరడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
గ్రామంలో ఉద్రిక్తత
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇక్కడే మకాం వేశారు. ఘటన అనంతరం పాట్నా రూరల్ ఎస్పీ, ఫతుహా డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు బలగాలను కూడా రప్పించారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.
ఇరువర్గాల మధ్య పంచాయితీ
ఈ ఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ.. రూ.400 పాల బకాయిలకు సంబంధించి పంచాయతీ నిర్వహించామని చెప్పారు. గ్రామంలోని కొందరు వ్యక్తులు ఇరువర్గాలను కూర్చోబెట్టి ఈ వివాదానికి ముగింపు పలకారు. అయితే గురువారం రాత్రి పాల బకాయి వివాదం ముదిరి ముగ్గురిని హత్యకు కారణం అయింది.
పాత భూ వివాదమే కారణం
ఈ ఘటనపై పాట్నా ఎస్‌ఎస్పీ మాట్లాడుతూ.. పాలకు సంబంధించిన డబ్బు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తడంతో కాల్పులు జరిగాయని చెప్పారు. నలుగురిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఒకరు ఆసుపత్రిలో చేరారు. రెండు వైపుల నుంచి బుల్లెట్ల మోత మ్రోగింది. ఒక వర్గానికి జై సింగ్, మరో వర్గానికి ప్రదీప్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు భూ వివాదంపై కూడా పోలీసులు మాట్లాడారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..