AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Fear: నెత్తురు మరిగిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌.. గజగజ వణికిపోతున్న జనాలు..

అడవిలో ఉండాల్సిన పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. నెత్తురు మరిగిన పులులు.. జనావాసాల్లో పంజా విసురుతున్నాయి. అభయారణ్యాలు వీడి గ్రామాలపై విరుచుకుపడుతున్నాయి.

Tiger Fear: నెత్తురు మరిగిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌.. గజగజ వణికిపోతున్న జనాలు..
Tiger
Shiva Prajapati
|

Updated on: Oct 01, 2022 | 9:20 PM

Share

అడవిలో ఉండాల్సిన పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. నెత్తురు మరిగిన పులులు.. జనావాసాల్లో పంజా విసురుతున్నాయి. అభయారణ్యాలు వీడి గ్రామాలపై విరుచుకుపడుతున్నాయి. ప్రాణాలు తీసేస్తున్నాయి.. బీహార్‌లో భయోత్పాతం సృష్టిస్తున్న ఓ టైగర్‌ టెర్రర్‌ హడలెత్తిస్తోంది.

అక్కడ గడపదాటాలంటే జనం గజగజ వణికిపోతున్నారు. అడుగు తీసి అడుగేయాలంటే ప్రాణాలుగ్గబట్టుకోవాల్సిందే. ఎటు నుంచి దాడిచేస్తుందో తెలియదు. ఏ వైపు నుంచి పంజా విసురుతుందో తెలియక హడలిఛస్తున్నారు ప్రజలు. బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాల్లో టైగర్‌ టెర్రర్‌ ఇది. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహాలో ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్‌లోని ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ సృష్టిస్తోన్న విధ్వంసం అంతా ఇంతా కాదు.. పరిసర గ్రామాల ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది మనిషి నెత్తురు రుచి మరిగిన ఈ పులి.. నెల రోజుల్లో ఐదుగుర్ని హతమార్చింది.

ప్రజలను హడలెత్తిస్తోన్న పులిని బంధించేందుకు అటవీశాఖ రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పులి దొరక లేదు సరికదా తాజాగా, అది తన స్థావరాన్ని మార్చుకుని హరిహర్‌పూర్ గ్రామంలోని చెరకు తోటల్లోకి చేరుకుంది. దీంతో.. గ్రామస్తుల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. పులిని పట్టుకునేందుకు నాలుగు ఏనుగులను రప్పించినా ఫలితం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 150 మంది అధికారులు, సిబ్బంది ఇప్పుడు పులివేటలోనే నిమగ్నమై ఉన్నారు. పులి మాత్రం అధికారుల కళ్ళుగప్పి తప్పించుకుతిరుగుతోంది. దీంతో ఇక లాభం లేదని భావించిన అధికారులు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌, అతని కొడుకు నవాబ్‌ అస్ఘర్‌ అలీ ఖాన్‌ను రంగంలోకి దించారు. పులిని పట్టుకునేందుకు గురువారం ఓ మేకను బోనులో పెట్టి కాపుకాశారు. తెల్లవారుజామున బోను వద్దకు వచ్చిన పులి అందరూ చూస్తుండగానే మేకను నోట కరుచుకుని పోయింది. ఇప్పుడు ఈ పులిని మట్టుబెట్టేందుకు హైదరాబాదీ షుటర్స్‌ వేట కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..