Tejashwi Yadav Wedding: ఓ ఇంటి వాడైన బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.. సాదాసీదాగా వివాహ వేడుక
Tejashwi Yadav Wedding Pics: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం
Tejashwi Yadav Wedding Pics: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం సాదాసీదాగా జరిగింది. ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో తేజస్వి యాదవ్ గురువారం ఏడడుగులు వేశారు. వీరి వివాహం దేశ రాజధాని ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్‌లో హిందూ సంప్రదాయం జరిగింది. ఈ పెళ్లి వేడుక లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీ దంపతులు, కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దంపతులు, రాజ్యసభ ఎంపీ మిసా భారతి తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వివాహానికి దాదాపు 50 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరైనట్లు సమాచారం. వివాహానికి సంబంధించిన దృశ్యాలను తేజస్వి సోదరి రోహిణి ఆచార్య ఒక ట్వీట్ చేశారు. ఆర్జేడీ నాయకులు, మద్దతుదారులు కూడా నూతన జంటకు సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు. కాగా.. ఏడేళ్ల స్నేహబంధం తర్వాత రాచెల్ గోడిన్హో, తేజస్వి యాదవ్ ఒక్కటయ్యారు. కాగా పెళ్లికూతురు రాచెల్‌ను ఇకపై రాజేశ్వరి యాదవ్‌గా పిలవనున్నారు.
కాగా.. మంగళవారం రాత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తేజస్వీ, రాచెల్ నిశ్చితార్థం వేడుక జరిగింది. లాలూ ప్రసాద్, రబ్రీదేవీల సంతానం తొమ్మిది మందిలో చివరి వాడు తేజస్వీ యాదవ్. ఆయనకు ఏడుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. కరోనా కారణంగా అతితక్కువ మందితో వేడుకను నిర్వహించారు.
हम नही है पास फिर भी मेरा आशीर्वाद है दोनो के साथ?? congratulations tutu nd Rachel ?Wishing you both a lifetime of happiness!?? pic.twitter.com/JF567vMqyL
— Rohini Acharya (@RohiniAcharya2) December 9, 2021
32 ఏళ్ల తేజస్వి.. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతేడాది జరిగిన బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్, వామపక్షాలతో జతకలిసి పోటీచేశారు. అయితే.. నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చేతిలో తేజస్వి కూటమి ఓడిపోయింది
Lots of love, blessings and happiness for my newly married couple ? pic.twitter.com/SFfld1sgFk
— Rohini Acharya (@RohiniAcharya2) December 9, 2021
बधाई अर्जुन pic.twitter.com/ocR5QxbM1Q
— I Support Tejpratap Yadav (@IsupportTej) December 9, 2021
Also Read: