Viral Video: అందరూ చూస్తుండగానే చాయ్‌వాలాను చితకబాదిన యువతి.. అసలు విషయం తెలిస్తే షాక్!

Viral Video: ప్రపంచంలో తండ్రికి కూతురు ఎప్పుడు ఓ యువరాణి.. తన కూతురు తనకు అమ్మ.. అదేవిధంగా తన తండ్రి అందరికంటే కూతురుకి గొప్ప వ్యక్తి.. ఇది బంధాలు అనుబంధాలు..

Viral Video: అందరూ చూస్తుండగానే చాయ్‌వాలాను చితకబాదిన యువతి.. అసలు విషయం తెలిస్తే షాక్!
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2021 | 6:44 PM

Viral Video: ప్రపంచంలో తండ్రికి కూతురు ఎప్పుడు ఓ యువరాణి.. తన కూతురు తనకు అమ్మ.. అదేవిధంగా తన తండ్రి అందరికంటే కూతురుకి గొప్ప వ్యక్తి.. ఇది బంధాలు అనుబంధాలు చెప్పిన నిజం..  అలాంటి తన తండ్రికి చిన్న అవమానం జరిగితే.. ఏ కూతురైనా ఎలా స్పందిస్తుందో తెలియజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వృద్ధుడైన తన తండ్రిని ఐదు రూపాయల కోసం కొట్టిన ఓ టీ దుకాణంపై విరుచుకు పడింది. తండ్రిని కొట్టిన ఆ టీ యజమానికి భద్రకాళిగా మారి కర్రతో బుద్ధి చెప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలోని శివపురిలోని దినారా పట్టణంలో ఐదు రూపాయల టీ కోసం వివాదం ఏర్పడింది. టీ దుకాణదారుడు తన వృద్ధ తండ్రిపై దాడి చేయడంతో కలత చెందిన బాలిక దుకాణదారుడిని కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు తేజ్ సింగ్ పరిహార్ ఇదే విషయంపై మాట్లాడుతూ..  తాను పట్టణంలోని హైవే సమీపంలోని భురా దుకాణంలో టీ తాగినట్లు తెలిపారు. టీ తాగిన తర్వాత రూ.5 చెల్లించినా .. తనకు ఇవ్వలేదని టీ కొట్టు యజమాని బూర చెప్పాడు. అంతేకాదు తేజ్ సింగ్ తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం భురా కోపంతో తేజ్ సింగ్‌ ను కొట్టాడు.

దెబ్బలు తిన్న తేజ్ సింగ్ ఇంటికి చేరుకున్నాడు. తండ్రిని కొట్టిన సంగతి తేజ్ సింగ్ కుమార్తెకు తెలిసింది. దీంతో ఆ  అమ్మాయి కోపంతో ఓ కర్ర తీసుకుని దుకాణానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే దుకాణదారుడిని కొట్టడం ప్రారంభించింది. దీంతో దుకాణం సమీపంలోని ప్రజలు గుమిగూడి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read:  రోజురోజుకీ బ్రిటన్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. డెల్టా కంటే ప్రమాదకరమంటున్న ప్రధాని జాన్సన్