Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనోడు గుండెలు తీసిన మొనగాడు.. అంత ఎత్తులో సన్నని తీగపై చక్కగా నడుస్తూ షాకిచ్చాడు..

Man walks Rope: సోషల్ మీడియో ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆహ్లాదకరంతగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. వీటిని చూస్తుంటే..

Viral Video: మనోడు గుండెలు తీసిన మొనగాడు.. అంత ఎత్తులో సన్నని తీగపై చక్కగా నడుస్తూ షాకిచ్చాడు..
French Man Walks 500 Metre
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 09, 2021 | 9:13 PM

Man walks Rope: సోషల్ మీడియో ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆహ్లాదకరంతగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. వీటిని చూస్తుంటే.. ఎన్ని సార్లైనా అలానే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే.. అలాంటి సన్నివేశాలు ఎలా సాధ్యమయ్యాయో ఊహకు కూడా అందదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఓ వ్యక్తి దాదాపు 300ల అడుగుల ఎత్తులో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా.. సన్నని తీగపై అరకిలోమీటరు పాటు నడిచాడు. ఈ వీడియో చూస్తుంటే.. ఒళ్లు జలధరిస్తుందని అతనికి ఎలా సాధ్యమయ్యిందోనంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు. వీడియో చూస్తే చమటలు పడుతున్నాయంటూ పేర్కొంటున్నారు.

నాథన్ పౌలిన్ అనే ఒక ఫ్రెంచ్ స్లాక్‌లైనర్ 264 అడుగుల ఎత్తులో ఒక తీగపై 500 మీటర్లపాటు నడిచాడు. ఫౌలిన్ బ్రెజిల్‌లోని రియో​డి జనీరోలోని బాబిలోనియా హిల్ – ఉర్కా హిల్ మధ్య గాలిలో రోప్ (తాడు) పై 264 అడుగుల ఎత్తులో నడిచాడు. పౌలిన్ ఈ దూరాన్ని అధిగమించడానికి దాదాపు గంటకుపైగా పట్టిందని పేర్కొంటున్నారు. పౌలిన్ అతితక్కువ సమయంలో ఈ లక్ష్యాన్ని అధిగమించినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. పౌలిన్ ఈ ఘనతను సాధించే ముందు ఎలాంటి రక్షణ సామగ్రిని వెంటతీసుకెళ్లలేదు. సాధారణంగా నడుస్తున్న మాదిరిగానే తీగపై నడుస్తూ కనిపించాడు. అయితే.. పౌలిన్ అంతకుముందు 2017లో ఈఫిల్ టవర్ దగ్గర 670 మీటర్ల నడకను పూర్తి చేసినట్లు పేర్కొంటున్నారు.

వీడియో.. 

కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత ఎత్తులో చిన్న తీగపై ఎలా నడిచాడంటూ నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోను చూస్తుంటే.. భయమేస్తుందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read:

Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి

Road Accident: శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి సహా దంపతుల మృతి..

Viral Video: మాటలు కూడా రాని వయసులో ముక్కలు లాగిస్తున్న బుడతడు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..