Road Accident: శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి సహా దంపతుల మృతి..
Visakhapatnam Road Accident: ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధురవాడ - చంద్రంపాలెం హైవేపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో
Visakhapatnam Road Accident: ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధురవాడ – చంద్రంపాలెం హైవేపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ ఢీకొట్టడంతో.. దానిపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ రెల్లి వీధి ప్రాంతానికి చెందిన రమణ తన భార్య, కుమార్తెతో భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి హజరయ్యాడు. అనంతరం బైక్‌పై తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైకును.. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.
దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడి మరణించారని పోలీసులు తెలిపారు. బైకును ఢీకొట్టిన తర్వాత లారీ వారిని కొద్ది దూరం వరకు లాక్కెల్లింది. మృతులను పోలిపల్లి రమణ, ఆయన భార్య రమాభాయ్, కుమార్తె దంతి కుమారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఒడిశా నుంచి అచ్యుతాపురం వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు.
Also Read: