Andhra Pradesh: అనంతపురం జిల్లాలో లేడీ చైన్‌స్నాచర్ హల్‌చల్.. బుర్ఖాలో వచ్చి…
ఇప్పటి వరకు చైన్ స్నాచర్స్ అంటే..కేవలం మగవాళ్లు మాత్రమే అనుకున్నాం..కానీ, అన్నింట సమానం అన్నట్టుగా ఇప్పుడు లేడీ చైన్ స్నాచర్స్ హల్‌చల్ చేస్తున్నారు

ఇప్పటి వరకు చైన్ స్నాచర్స్ అంటే..కేవలం మగవాళ్లు మాత్రమే అనుకున్నాం..కానీ, అన్నింట సమానం అన్నట్టుగా ఇప్పుడు లేడీ చైన్ స్నాచర్స్ హల్‌చల్ చేస్తున్నారు. చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ ప్రజల్ని పరుగులు పెట్టిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో లేడీ చైన్ స్నాచర్ హల్‌చల్ చేసింది. చిన్నారి మెడలో నుంచి చైన్ ను లాక్కోని పారిపోయే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేట్ రోడ్ కాలనీలో కిరాణా సరుకులు తీసుకుంటున్న మహిళ తన కూతుర్ని ఎత్తుకుని ఉంది. చిన్నారి మెడలో నుంచి గుర్తు తెలియని మహిళ హఠాత్తుగా చైన్ లాగడానికి యత్నించింది. అంతలోనే తల్లి గమనించి గట్టిగా అరుస్తూ. మహిళ దొంగను నిలదీసింది.
పారిపోవడానికి ప్రయత్నించగా, స్థానికుల సాయంతో చోరీకి యత్నించిన మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే చైన్ స్నాచింగ్ పాల్పడేటప్పుడు ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు సదరు మహిళ బుర్ఖా దరించింది. మహిళా దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు విచారణ చేపట్టారు. గతంలో కూడా ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందేమో అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
Also Read: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్
Kurnool district: మిరప చేనులో నక్కిన భారీ కొండచిలువ.. రైతు పొలానికి వెళ్లగానే