AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి

Sabarimala Road Accident: అయ్యప్ప మాలను ధరించి వారంతా శబరిమలకు ప్రయనమయ్యారు. మరికాసేపట్లో శబరిమలకు చేరుతారనగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో

Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి
Road Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Dec 09, 2021 | 4:09 PM

Share

Sabarimala Road Accident: అయ్యప్ప మాలను ధరించి వారంతా శబరిమలకు ప్రయనమయ్యారు. మరికాసేపట్లో శబరిమలకు చేరుతారనగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. నగరంలోని బుధవారపేటకు చెందిన అయ్యప్పస్వాములు వాహనంలో శబరిమలకు పయనమయ్యారు. శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి టీ తాగుతుండగా.. వెనుక నుంచి మరో వాహనం టెంపోను ఢీకొట్టి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. 9మందికి గాయాలయ్యాయి. మృతులను బధవారపేట, దేవనగర్‌కు చెందిన ఆదినారాయణ, శంకర్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బుధవారం కర్నూలు నగరం నుంచి 11 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరారు. గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో శబరిమలకు 60 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొంటున్నారు. బస్సు టెంపోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే.. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:

Cheddi Gang: బెజవాడలోనే మకాం వేసిన చెడ్డీగ్యాంగ్.. వెలుగులోకి మరో దోపిడి ఘటన.. వీడియో

రూ.1000 కోట్ల ఆదాయంపై పన్ను ఎగ్గొట్టిన ఓ సంస్థ.. ఐటీ దాడుల్లో బయటపడిన అక్రమాల చిట్టా

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?