రూ.1000 కోట్ల ఆదాయంపై పన్ను ఎగ్గొట్టిన ఓ సంస్థ.. ఐటీ దాడుల్లో బయటపడిన అక్రమాల చిట్టా

వెయ్యి కోట్లకు పైగా ట్యాక్స్‌ ఎగ్గొట్టింది ఓ సంస్థ. ఒకేసారి 37 ప్రాంతాల్లో జరిపిన ఐటీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

రూ.1000 కోట్ల ఆదాయంపై పన్ను ఎగ్గొట్టిన ఓ సంస్థ.. ఐటీ దాడుల్లో బయటపడిన అక్రమాల చిట్టా
Representative Image
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 08, 2021 | 6:11 PM

తమిళనాడులో శరవణ స్టోర్స్‌కి అనేక శాఖలున్నాయి. క్లాత్స్‌ బిజినెస్‌తో పాటు ఆభరణాలు, గృహోపకరణాలకు సంబంధించిన షాపులున్నాయి. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ కంపెనీ దాదాపు రూ.1000 కోట్ల మేర ట్యాక్స్‌ ఎగ్గొట్టి అక్రమ అమ్మకాలు జరిపినట్లు ఐటీ అధికారులు తేల్చారు. చెన్నైలోని టినగర్‌లో సూపర్‌ శరవణ స్టోర్స్‌, శరవణ సెల్వరత్నం పేర్లతో శరవణ వస్త్ర దుకాణాలున్నాయి. చెన్నై నగర శివారు ప్రాంతాల్లో కూడా బ్రాంచీలున్నాయి. వస్త్రాలు మాత్రమే కాకుండా ఆభరణాలు, గృహోపకరణాలు విక్రయిస్తున్నారు. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరుకు చెందిన వినియోగదారులు కూడా నిత్యం ఇక్కడ షాపింగ్‌కు వస్తుంటారు. భారీ ఎత్తున వస్త్రాలు, గృహోపకరణాలు, ఆభరణాలు కొంటుంటారు.

ట్యాక్స్‌ ఎగ్గొట్టారనే సమాచారంతో ఐటీ అధికారులు శరవణ స్టోర్స్‌పై ఐదు రోజుల పాటు సోదాలు చేశారు. మొత్తం 37 ప్రాంతాల్లోని శరవణ స్టోర్స్‌ల్లో ఐదు రోజులు ఒకే సమయంలో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించారు. శరవణ స్టోర్స్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు పరిశీలించగా దాదాపుగా రూ.1,000 కోట్లకు పైగా పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడినట్టు తేలిందని ఐటీ అధికారులు వెల్లడించారు. లెక్కల్లో చూపించకుండా పెద్ద ఎత్తున వస్త్రాలు, గృహోపకరణాలు, ఆభరణాలను విక్రయిస్తున్నట్లు సోదాల్లో గుర్తించారు.

పక్కా సమాచారంతోనే శరవణ స్టోర్స్‌లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. 37 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో భారీగా ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్టు బయటపడింది. దీంతో కొంత నగదుతో పాటు నగలను కూడా ఐటీ అధికారులు సీజ్‌ చేశారు.

Also Read..

Air Crashes: విహంగ ప్రయాణాలు మిగిల్చిన విషాదాలు.. ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు..!

Vamshi Paidipally: భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి.. హీరోలుగా ఎవరంటే..!