Vamshi Paidipally: భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి.. హీరోలుగా ఎవరంటే..!
మహర్షి సినిమాతో జాతియస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వంశీ పైడి పల్లి. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Vamshi Paidipally: మహర్షి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వంశీ పైడి పల్లి. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరవాత తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాడు వంశీ. అయితే మహర్షి సినిమా తర్వాత మహేష్ తో మరో సినిమా చేయాలనీ వంశీ ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు మహేష్ ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. వంశీ ఈ సారి మల్టీస్టారర్ కథతో రానున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ కథలో మహేష్ తోపాటు మరో స్టార్ హీరో నటించనున్నాడట. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మహేష్ – చరణ్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడట వంశీ.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా కన్ఫామ్ చేసారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అటు చరణ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చేస్తున్నాడు, అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాలతర్వాత బడా డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఇక మహేష్- చరణ్ కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈవార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :