Viral Video: మాటలు కూడా రాని వయసులో ముక్కలు లాగిస్తున్న బుడతడు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
మాటలు కూడా రాని చిన్న పిల్లలు ఎక్కువగా ఏం తింటారు అని అడిగితే టక్కున అన్నం, చిప్స్, లేకపోతే పాలు తాగుతారు ఇలా ఏవో సమాదానాలు చెప్తం..
Viral Video: మాటలు కూడా రాని చిన్న పిల్లలు ఎక్కువగా ఏం తింటారు అని అడిగితే టక్కున అన్నం, చిప్స్, చక్లెట్స్ లేకపోతే పాలు తాగుతారు.. ఇలా ఏవో సమాదానాలు చెప్తం.. కానీ నాన్ వెజ్ తింటారని ఎవరైనా అనుకుంటారా.. మాటలు కూడా రాని వయసులో ముక్కలు తింటారని ఊహించగలమా.. కానీ ఓ బుడతడు చికెన్ ను చిన్న పీస్ కూడా మిగల్చకుండా లాగించేశాడు. చెప్తే నమ్మరు కానీ ఇందుకు సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బుడతడు చికెన్ ను ఆవురావురు మంటూ లాగించేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో చిన్నారి ప్లేట్ లో చికెన్ లెగ్ పీస్ లను చిన్న పీస్ కూడా మిగల్చకుండా తినేశాడు. ఎముకపై ఒక్క చికెన్ జాడ కూడా వదలకుండా తన కొడుకు మొత్తం చికెన్ వింగ్‌ను ఎలా పూర్తి చేశాడో ఆ బుడతడి తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చికెన్ తింటున్న ఫన్నీ మీమ్స్ ను కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫన్నీ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..
Not him cleaning the chicken wing better than me last night. I’m shook ? pic.twitter.com/LlbdjYtijx
— Knight (@knightsglow) December 4, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :