Bipin Rawat Death: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరణం గురించి ఏడాది క్రితమే హెచ్చరించిన గాయత్రి దేవి వాసుదేవ్.. ఫోటో వైరల్
CDS Bipin Rawat Death: ఆధునిక సమాజంలో మూఢనమ్మకాల అంటూ మన శాస్త్రాలను, నమ్మకాలను, ఎద్దేవా చేసేవారున్నారు. అయితే ఇప్పటికీ వేళ్ళతో లెక్కలు వేసి.. ఈరోజున ఎప్పుడు ఏ సమయంలో..
CDS Bipin Rawat Death: ఆధునిక సమాజంలో మూఢనమ్మకాల అంటూ మన శాస్త్రాలను, నమ్మకాలను, ఎద్దేవా చేసేవారున్నారు. అయితే ఇప్పటికీ వేళ్ళతో లెక్కలు వేసి.. ఈరోజున ఎప్పుడు ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుందో చెప్పే పండితులున్నారు. అంతేకాదు.. పుట్టిన వెంటనే మనిషి జీవిత ప్రయాణం మరణం గురించి కూడా చెప్పే జ్యోతిష్యులు ఉన్నారని కొంతమంది నమ్మకం. కొంతమంది వీటిని మూఢనమ్మకం అంటూ కొట్టిపడేస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు జరిగిన జరుగుతున్న సంఘటనలు జ్యోతిష శాస్త్రానికి నిదర్శనం అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ జ్యోతిషశాస్త్ర పత్రిక “జ్యోతిష్యం” పేజీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ పేజీ జనవరి 2021లో వచ్చిన సంచిక.. అయితే జ్యోతిష్యం నవంబర్ 2020లో వ్రాయబడినట్లు తెలుస్తోంది. ఈ పత్రిక బెంగుళూరు నుండి వస్తోంది. ? ఈ ప్రతికా సంపాదకురాలు గాయత్రీ దేవి. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జ్యోతిష్యంలో పేరుగాంచిన బి.వి. రామన్ కూతురు గాయత్రి వాసుదేవ్ కుమార్తె గాయత్రి వాసుదేవ్. అయితే ప్రస్తుతం ఈ పేజీ ఏమిటి? ఎందుకు వైరల్ అవుతుందో తెలుసా..?
ఈ పేజీలో దేశంలోని దేశంలో నేరాలు, హింస గురించి ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గంలోని సహాయ మంత్రికి భద్రతను పెంచమని ఉంది. అంతేకాదు దేశంలోని అగ్రశ్రేణి నాయకుల్లో కనీసం ఇద్దరు (వీరు కూడా సైనికాధికారులు కావచ్చు) అకస్మాత్తుగా మరణించవచ్చు. జూలై 25, 2021న కేతువు నక్షత్రంలోకి ప్రవేశించింది. దీంతో మే 26, 2021 , డిసెంబర్ 4, 2021 గ్రహణాల మార్గం సున్నితంగా ఉంటుంది. దీంతో నేరస్థులు డిసెంబర్ 14, 2021 నాటికి యాక్టివ్‌గా ఉండవచ్చు, ”అని పేర్కొంది.
ఇప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో CDS బిపిన్ రావత్ డిసెంబర్ 8, 2021న మరణించారు. ఈ ఘటన అనంతరం జనవరి 2021లో ప్రచురించబడిన కథనం భారీగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గాయత్రీ దేవి వాసుదేవ్ తో టీవీ9 కన్నడ డిజిటల్ ప్రత్యేకంగా మాట్లాడింది.
ఈ సందర్భంగా గాయత్రి దేవి మాట్లాడుతూ.. తాను లా చదువుకున్నట్లు చెప్పారు. అయితే తన జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక సంఘటన నన్ను జ్యోతిష్యం నేర్చుకునేలా చేసిందని అన్నారు. మా నాన్నబి.వి. రామన్ దగ్గర 30 ఏళ్లు జ్యోతిష్యం అభ్యసించానని చెప్పారు. అయితే తాను ఎప్పుడు ఎవరికీ తన గురించి చెప్పుకోలేదని.. కానీ నిన్న (మిలిటరీ చీఫ్) మరణం తర్వాత, చాలా కాల్స్ వచ్చాయని అన్నారు. సర్వసాధారణంగా మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనని చెప్పారు.
మన ఋషిలు, మునిలు జ్యోతిష్యంలో గ్రహాల మార్పు సమయంలో ఏమి జరుగుతుందో ఎప్పుడో చెప్పారు. మా నాన్నగారి నుంచి వచ్చిన చదువు, అనుభవం భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు తనకు తోడ్పడతాయిని అన్నారు. జ్యోతిష్యాన్ని మరింతగా అధ్యయనం చేయాలని… ఎందుకంటే జ్యోతిష్యం అనేది భవిష్యత్తు గురించి మూడు వర్గాలుగా విభజించబడిందని చెప్పారు. తన మాట వినను అన్నవారికి తాను చెప్పేది ఏమీ లేదని అన్నారు గాయత్రీదేవి వాసుదేవ్.
Also Read: శ్రీమంతుల టూరిస్ట్ స్పాట్‌గా అంతరిక్షం.. 12 రోజులు సరదాగా గడపడానికి వెళ్లిన జపాన్ కుబేరులు..