Bihar Blast: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు.. ఆరుగురు దుర్మరణం.. శిథిలాల కింద మరికొందరు..
సరన్ జిల్లా ఖోదైబాగ్ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Bihar explosion: బీహార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరన్ జిల్లా ఖోదైబాగ్ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సరన్ ఎస్పీ సంతోష్ కుమార్ ధృవీకరించారు. పేలుడు జరిగిన భవనంలోని ఒక గదిలో బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటున్నారు. పేలుడు ధాటికి మూడంతస్తుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలో అక్రమంగా బాణసంచా ఫ్యాక్టరీలు నడుపుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ब्लास्ट से दहल हुआ छपरा.. अवैध पटाखा फैक्ट्री में हुआ धमाका.तीन के मौत की आशंका जबकि कुछ लोग गंभीर रूप से घायल.सारण जिला के खैरा थाना क्षेत्र के खोदाईबाग इलाके में एक मकान में जबरदस्त विस्फोट के बाद घर ढह गया और मकान के बचे हिस्से में आग लग गई. छपरा से आशुतोष. pic.twitter.com/2J672SG8a3
— Prakash Kumar (@kumarprakash4u) July 24, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..