AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Election Results 2025 Live: NDA అఖండ విజయం.. 95 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ

Bihar Assembly Election Results 2025 Live Counting and Updates in Telugu: బీహార్‌లో భారీ మెజార్టీ దిశగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తోంది. బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. అతిపెద్ద విజయం సాధించనుంది. ఎక్కడా చూసినా కూటమి అభ్యర్థులు ఆధిక్యంతో కొనసాగుతున్నారు...

Bihar Election Results 2025 Live: NDA అఖండ విజయం.. 95 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ
Bihar Election Results 2025 Live
Balaraju Goud
|

Updated on: Nov 14, 2025 | 9:23 PM

Share

Bihar Assembly Election Results 2025 Live Counting and Updates in Telugu: దేశం మొత్తం బిహార్‌ వైపు చూస్తోంది. అక్కడ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుందా…? అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపే మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై మాత్రం ఉత్కంఠ నెలకుంది. అభివృద్ధి కావాలా…? ఆటవిక పాలనా…? అంటూ ఎన్డీయే ప్రచార పర్వం కొనసాగించగా… ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠ్‌బంధన్‌ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బిహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్‌. అయితే అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు 122. మొత్తం ఓటర్ల సంఖ్య 7.45 కోట్లు. ఇందులో పురుషులు 3.92 కోట్ల మంది, మహిళలు 3.50 కోట్ల మంది ఉన్నారు.

బిహార్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.80 శాతం, మహిళల్లో 71.60 శాతం మంది ఓటేశారు.బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 6, నవంబర్ 11న రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగాయి. పోలింగ్‌ రికార్డుస్థాయిలో నమోదు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారో. మొత్తం అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిహార్‌లోని 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Nov 2025 08:23 PM (IST)

    రెండు సీట్లు గెలుచుకున్న ఎంఐఎం

    అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీ కోచధమన్, అమోర్ స్థానాలలో విజయం సాధించింది. కోచధమన్ నుండి సర్వర్ ఆలం, అఖ్తరుల్ ఇమాన్ అమోర్ నుండి గెలిచారు.

  • 14 Nov 2025 08:22 PM (IST)

    NDA విజయంపై చిరాగ్ పాస్వాన్ తొలి స్పందన

    పార్టీ, ఎన్డీఏ కూటమి మధ్య సమన్వయం మా అఖండ విజయానికి దారితీసిందని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. “నేను ఎవరి ఓటమి గురించి వ్యాఖ్యానించను, కానీ నా కూటమి విజయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా తండ్రి ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను” అని ఆయన అన్నారు.

  • 14 Nov 2025 08:21 PM (IST)

    ఎన్డీఏ విజయంపై జితన్ రామ్ మాంఝీ ఏమన్నారంటే?

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించిన తర్వాత, జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, “మేము ఊహించిన దానికంటే అంతర్లీన ప్రవాహం మరింత ఎక్కువగా ఉంది. ప్రజలు నితీష్ కుమార్ పై నమ్మకం ఉంచారు. ప్రధానమంత్రి మోదీ, నితీష్ కుమార్ తమ పనిని చేశారు, ఇది బంధుప్రీతి, అవినీతి రహితంగా ఉంది. ఓటర్లందరికీ, ముఖ్యంగా మహిళా ఓటర్లకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.”

  • 14 Nov 2025 08:19 PM (IST)

    కేవలం 21 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్

    బీహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కేవలం 21 ఓట్ల తేడాతో గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్ బీజేపీకి చెందిన విద్యా సాగర్‌ను ఓడించారు. మనోజ్ బిశ్వాస్‌కు 1,20,114 ఓట్లు వచ్చాయి.

  • 14 Nov 2025 08:18 PM (IST)

    ఓడిపోయిన లాలూ ప్రసాద్ కొడుకు

    లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్‌లోని మహువా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన చిరాగ్ పాశ్వాన్ పార్టీ అభ్యర్థి సంజయ్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశాడు. తేజ్ ప్రతాప్ యాదవ్ మొత్తం 35,708 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఆర్జేడీకి చెందిన ముఖేష్ రోషన్ రెండవ స్థానంలో నిలిచారు.

  • 14 Nov 2025 08:17 PM (IST)

    సీఎం నితీష్ కుమార్ తొలి స్పందన

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలి స్పందన వెలువడింది. ఈ విజయంపై సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, “2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీనికి, రాష్ట్రంలోని ఓటర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

  • 14 Nov 2025 08:15 PM (IST)

    రఘోపూర్ సీటు దక్కించుకున్న తేజస్వి యాదవ్

    ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ రఘోపూర్ సీటును గెలుచుకున్నారు. 32 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. రఘోపూర్ నుండి ఆయన వరుసగా మూడవ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తేజస్వి యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్‌ను ఓడించారు. కౌంటింగ్ సమయంలో, తేజస్వి అనేక రౌండ్లలో వెనుకబడి ఉన్నాడు. కొన్నిసార్లు ఓడిపోవచ్చు అని అనిపించింది. చివరికి తేజస్వి యాదవ్‌కు 1,18,597 ఓట్లు రాగా, రెండవ స్థానంలో నిలిచిన బీజేపీకి చెందిన సతీష్ కుమార్‌కు 1,04,065 ఓట్లు వచ్చాయి.

  • 14 Nov 2025 05:20 PM (IST)

    సుపరిపాలన గెలిచిందిః ప్రధాని మోదీ

    బీహార్ ఎన్నికల ఫలితాలపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సుపరిపాలన గెలిచింది.  అభివృద్ధి గెలిచింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి గెలిచింది.  సామాజిక న్యాయం గెలిచింది.  2025 అసెంబ్లీ ఎన్నికల్లో NDA కి చారిత్రాత్మకమైన అపూర్వమైన విజయంతో ఆశీర్వదించిన బీహార్‌లోని నా కుటుంబ సభ్యులకు చాలా కృతజ్ఞుడిని అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అఖండ తీర్పు ప్రజలకు సేవ చేయడానికి బీహార్ కోసం నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

    ‘‘మా ట్రాక్ రికార్డ్‌ను, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే మా దార్శనికతను గుర్తించి, ప్రజలు మాకు అఖండ మెజారిటీని ఇచ్చారు. ఈ అద్భుతమైన విజయానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ భాగస్వాములు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ ఉపేంద్ర కుష్వాహలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.’’ అని అన్నారు.

  • 14 Nov 2025 04:57 PM (IST)

    మోదీ పాలనపై బలపడుతున్న నమ్మకంః చంద్రబాబు

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం ప్రగతిశీల పాలన అందించగల సామర్థ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విక్షిత్ భారత్ దార్శనికతను కూడా ప్రతిబింబిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా X పై ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

  • 14 Nov 2025 04:53 PM (IST)

    అభివృద్ధికి పట్టం కట్టిన బీహార్‌: అమిత్ షా

    బీహార్‌లో ఎన్డీఏ సాధించిన అఖండ విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. అభివృద్ధి చెందిన బీహార్‌ను నమ్మే ప్రతి బీహారీకి ఇది విజయం అని అమిత్ షా అన్నారు.

  • 14 Nov 2025 03:44 PM (IST)

    కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్..!

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  • 14 Nov 2025 03:42 PM (IST)

    కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం!

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ, జేడీ(యు) కూటమి నాయకత్వం వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ధోరణుల నేపథ్యంలో, రెండు పార్టీల కార్యాలయాలు ఆనందంతో నిండిపోయాయి. విజయాన్ని జరుపుకునేందుకు పెద్ద ఎత్తున తేలివచ్చిన కార్యకర్తలు స్వీట్లు పంచుతూ డాన్స్ చేస్తూ, పటాకులు పేల్చారు.

  • 14 Nov 2025 03:39 PM (IST)

    అఖండ విజయం దిశగా పాతికేళ్ల యువతి!

    బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ అలీనగర్ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 10 రౌండ్ల తర్వాత, మైథిలి 38,832 ఓట్లు సాధించి, రెండవ స్థానంలో ఉన్న వినోద్ మిశ్రా కంటే 8,551 ఓట్లు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం వినోద్ 30,281 ఓట్లు సాధించారు. సగానికిపైగా ముస్లిం ఓటర్లున్న ఆలీనగర్ నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. పాతికేళ్ల ఈ యువతి బీజేపీ నుంచి పోటీ చేసింది. ప్రస్తుతం మెజారిటీతో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్నారు.

  • 14 Nov 2025 03:30 PM (IST)

    తన రికార్డును తానే బద్దలు కొట్టిన ఎన్డీఏ

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA అద్భుతంగా రాణించింది. ఇది 2010 నాటి తన రికార్డును తానే బద్దలు కొట్టింది. 2010లో NDA కూటమి 206 స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కూటమి 208 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 14 Nov 2025 03:28 PM (IST)

    ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ప్రెస్‌మీట్

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, జన్ సూరజ్ పార్టీ భవిష్యత్ వ్యూహంపై ఆపార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ నవంబర్ 16న విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

  • 14 Nov 2025 03:27 PM (IST)

    తేజస్వి యాదవ్ 4,829 ఓట్ల వెనుకంజ

    రఘోపూర్ అసెంబ్లీ స్థానంలో తేజస్వి యాదవ్ 4,829 ఓట్ల వెనుకబడి ఉన్నారు. 11వ రౌండ్ తర్వాత, బీజేపీకి చెందిన సతీష్ కుమార్ 44,929 ఓట్లు సాధించగా, తేజస్వి 40,100 ఓట్లు సాధించారు.

  • 14 Nov 2025 03:26 PM (IST)

    బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయానికి చేరువలో ఉంది. బీహార్‌లో తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:00 గంటలకు పాట్నా బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను ప్రకటించారు.

  • 14 Nov 2025 03:24 PM (IST)

    తారాపూర్‌లో RJD అభ్యర్థి ఓటమి

    ముంగేర్ జిల్లాలోని తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ షా తన ఓటమిని అంగీకరిస్తూ తొలి స్పందన వ్యక్తం చేశారు. “ఇది ప్రజా తీర్పు. ఓట్ల శాతం పెరిగడంతో తలరాతలు మారిపోయాయి. ఇప్పుడు మేము మా జాతీయ అధ్యక్షుడితో మాట్లాడి తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటాము” అని ఆయన అన్నారు.

  • 14 Nov 2025 03:23 PM (IST)

    చరిత్ర సృష్టించిన బీజేపీ

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడం చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో, 2010లో బీజేపీ 91 స్థానాలు గెలుచుకుంది.

  • 14 Nov 2025 03:21 PM (IST)

    ముఖ్యమంత్రి ఎవరు?

    బీహార్‌లో NDA విజయం తర్వాత, వినోద్ తవ్డే ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. “మేము నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల్లో పోరాడాము. ముఖ్యమంత్రి ఎవరు కావాలో ఐదు పార్టీలు కలిసి నిర్ణయిస్తాయి” అని ఆయన అన్నారు.

  • 14 Nov 2025 03:03 PM (IST)

    ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసంః పవన్

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే భారత దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన సాధ్యమని, దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో మరోమారు రుజువైందన్నారు. ఎన్డీఏ కూటమి సాధించిన స్థానాలు ప్రధాని మోదీ నాయకత్వం పట్ల దేశ ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి తార్కాణాలు. ఇంతటి విజయానికి కారకులైన ప్రధాని మోదీకి మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  • 14 Nov 2025 02:27 PM (IST)

    గ్రాండ్ విక్టరీ దిశగా దూసుకుపోతున్న ఎన్డీఏ

    202 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యం, 35 స్థానాల్లో మహా ఘట్ బంధన్ ఆధిక్యం, 6స్థానాల్లో ఇతరులు ముందంజ

    బీజేపీ- 91, జెడియు – 81, ఎల్ జేపీ – 21, హెచ్ ఏ ఎం – 5, ఆర్ ఎల్ ఎం – 4

    ఆర్జేడీ – 26 , కాంగ్రెస్ – 4, వీఐపీ 0, లెఫ్ట్ – 5

    ఎంఐఎం – 05 స్థానాల్లో అధిక్యం

  • 14 Nov 2025 02:21 PM (IST)

    ఎన్డీఏకే బీహార్ ప్రజల అశీస్సులుః స్వతంత్ర దేవ్

    “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మెజారిటీ దిశగా పయనిస్తోంది. ప్రజల ఆశీస్సులు ఎన్డీఏపై ఉన్నాయి” అని ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ అన్నారు.

  • 14 Nov 2025 01:55 PM (IST)

    జెడియు అద్భుతమైన ప్రదర్శన

    బీహార్ ఎన్నికల్లో జెడియు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఆ పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫలితాలతో ఆనందంగా ఉన్న జెడియు, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

  • 14 Nov 2025 01:20 PM (IST)

    ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సంబరాలు

    ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నాయి. బీహార్లో భారీ మెజార్టీ దిశగా అడుగులు వేస్తోంది ఎన్డీయే కూటమి. సాయంత్రం బీజేపీ కార్యాలయానికి ప్రధాని మోదీ రానున్నారు. సందర్భంగదా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

  • 14 Nov 2025 12:58 PM (IST)

    బీహార్‌లో కాంగ్రెస్‌ కన్నా MIM ముందంజ

    బీహార్లో కాంగ్రెస్‌ కన్నా MIM ముందంజ

    — 5 స్థానాల్లో మజ్లిస్‌, 4 స్థానాల్లో కాంగ్రెస్‌ లీడింగ్‌

    సీమాంచల్‌లో నాలుగు సీట్లలో MIM ఆధిక్యం

    జోకిహిట్‌, బైసీ, కోచాధామన్‌, ఆమౌర్‌లో ముందంజ

    సీమాంచల్‌లో మహాఘట్‌బంధన్‌ను దెబ్బతీసిన ఎంఐఎం

    — మెజార్టీ సీట్లలో ఓట్లను చీల్చిన ఎంఐఎం

  • 14 Nov 2025 12:45 PM (IST)

    సీమాంచల్‌లో నాలుగు సీట్లలో MIM ఆధిక్యం

    • సీమాంచల్‌లో నాలుగు సీట్లలో MIM ఆధిక్యం
    • జోకిహిట్‌, బైసీ, కోచాధామన్‌, ఆమౌర్‌లో ముందంజ
    • సీమాంచల్‌లో మహాఘట్‌బంధన్‌ను దెబ్బతీసిన ఎంఐఎం

  • 14 Nov 2025 12:22 PM (IST)

    బీహార్‌లో ఎన్డీయే విజయంపై స్పందిచిన మంత్రి కిషన్‌రెడ్డి

    బీహార్‌లో ఎన్డీయే విజయంపై మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అభివృద్ధికి బీహార్‌ ప్రజలు పట్టం గట్టారని అన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, అందుకే ప్రజలు ఎన్డీయే కూటమికి భారీ విజయం అందించారు కిషన్‌రెడ్డి అన్నారు.

  • 14 Nov 2025 11:52 AM (IST)

    తర్న్ తరన్ స్థానంలో ఆప్ 7000 ఓట్ల ఆధిక్యంలో

    తర్న్ తరన్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. 10 రౌండ్ల కౌంటింగ్ తర్వాత, ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 7,294 ఆధిక్యంలో ఉన్నారు.

  • 14 Nov 2025 11:30 AM (IST)

    విశాఖ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    విశాఖ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో బీజేపీ 200 సీట్లలో గెలవబోతుంది అన్నారు. దేశ ప్రజలంతా మోదీ వైపే ఉన్నారు చంద్రబాబు అన్నారు. మోదీ ఒక్కరే దేశాన్ని నడిపించే నేత అని, దేశానికి సరైన సమయంలో సరైన నేత నాయకత్వం వహిస్తున్నారని అన్నారు.ప

  • 14 Nov 2025 11:18 AM (IST)

    Bihar Poll Result 2025: ఆర్జేడీ అధినేత తేజశ్వి యాదవ్ వెనుకంజ

    బీహార్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. రాఘోపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన తేజశ్వి యాదవ్‌ వెనుకంజలో కొనసాగుతున్నారు. 3వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ కంటే వెనుకంజలో ఉన్నారు.

  • 14 Nov 2025 11:15 AM (IST)

    Bihar Poll Result: బీహార్‌లో ప్రభావం చూపని ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ

    బిహార్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ ప్రభావం చూపించడం లేదు. 2 సీట్లలో లీడింగ్‌లో జన్‌సురాజ్‌ పార్టీ ఉంది. 230 సీట్లలో జన్‌సురాజ్‌ పార్టీ పోటీ చేసింది. ప్రస్తుతం 3శాతం ఓట్లతో ఉన్న జన్‌సురాజ్‌ పార్టీ.. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్‌లో NDA హవా కొనసాగుతోంది.

  • 14 Nov 2025 10:59 AM (IST)

    Bihar Assembly Poll Result: ఎన్డీయే వైపు నిలిచిన మహిళలు

    బీహార్‌లో మహిళలు NDAవైపు నిలిచారు. ఎన్నికలకు ముందు కొత్త పథకాన్ని నితీష్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన పథకం తీసుకువచ్చింది. మహిళల ఖాతాలో రూ.10వేలు వేసింది సర్కార్‌. 25 లక్షల మహిళల ఖాతాలో రూ.10వేలు జమ చేసింది. అయితే ఎన్డీయే ప్రస్తుతం 180 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 14 Nov 2025 10:54 AM (IST)

    సీమాంచల్‌లో MGBని దెబ్బకొట్టింది మజ్లిస్‌ పార్టీ

    సీమాంచల్‌లో MGBని దెబ్బకొట్టింది మజ్లిస్‌ పార్టీ. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్‌లో NDA హవా కొనసాగుతోంది. సీమాంచల్‌లో NDA కూటమికి ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే మజ్లిస్‌కు ఓట్ల శాతం పెరగడంతో MGBకి భారీ నష్టం కలుగనుంది.

  • 14 Nov 2025 10:51 AM (IST)

    ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి ఫలితాలు

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి ఫలితాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.  180కి పైగా సీట్లలో NDA ఆధిక్యం ఉండగా, 60 కన్నా తక్కువ సీట్లకు పడిపోయింది మహాఘట్‌బంధన్‌ పార్టీ, ఇక బీజేపీకి 82, జేడీయూ 74, ఎల్జేపీ 21 సీట్లలో హవా కొనసాగుతోంది.

  • 14 Nov 2025 10:42 AM (IST)

    బీహార్ లో నిజమవుతున్న అమిత్ షా నినాదం

    బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ కౌటింగ్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యంతో దూసుకుపోతోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో అమిత్‌షా నినాదం నిజమవుతోంది. “అబ్కీ బార్ 160 పార్” అన్న అమిత్ షా నినాదం నిజమవుతోంది. 164 స్థానాల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

  • 14 Nov 2025 10:40 AM (IST)

    ఆధిక్యంలో ఎన్డీయే కూటమి

    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 167 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యం ఉండగా, 69 స్థానాల్లో మహా ఘట్ బంధన్ ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే 6 స్థానాల్లో ముందంజలో ఇతరులు ఉన్నారు. బీజేపీ 72,జెడియు 72,ఎల్ జేపీ 20,హెచ్ ఏ ఎం 2,ఆర్ ఎల్ ఎం 1, ఆర్జేడీ 44 ,కాంగ్రెస్ 17, వీఐపీ 2, లెఫ్ట్ 6, 1 స్థానంలో ముందంజ లో జన్ సురాజ్ పార్టీ,6 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.

  • 14 Nov 2025 10:04 AM (IST)

    ఆధిక్యంలో బీజేపీ

    ఎన్నికల కమిషన్ ప్రకారం, బిజెపి 44 స్థానాల్లో, జెడియు 43 స్థానాల్లో, ఆర్జెడి 24 స్థానాల్లో, ఎల్జెపి 12 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రిని రాజ్యాంగ విధానాల ద్వారా నిర్ణయిస్తామని బీహార్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ అన్నారు. ఓట్ల దొంగతనం అంశం మహా కూటమిని ముంచెత్తిందని ఆయన అన్నారు.

  • 14 Nov 2025 09:53 AM (IST)

    బీహార్‌లో అటు కౌంటింగ్‌, ఇటు నిరసనలు

    బీహార్‌లో అటు కౌంటింగ్‌, ఇటు నిరసనలు కొనసాగుతున్నాయి. ఓట్‌ చోరీ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇప్పటికే పలుకౌంటింగ్‌ కేంద్రాల దగ్గర నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై బీహార్‌లపై మాణిక్కం ఠాగూర్‌ ట్వీట్‌ చేశారు. ప్రతిపక్షాలకు సంబంధించిన 65 లక్షల ఓట్లు తొలగించారని ట్వీట్‌ చేశారు. ఇంక ఫలితాలు ఏం ఆశిస్తాం అంటూ నిట్టూర్చారు. మ్యాచ్‌కు ముందే ఫిక్సింగ్‌ జరిగితే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది మాణిక్కం అన్నారు.

    Manickam

  • 14 Nov 2025 09:49 AM (IST)

    కొనసాగుతున్న బీహార్ ఓట్ల లెక్కింపు

    151 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యం, 87 స్థానాల్లో మహా ఘట్ బంధన్ ఆధిక్యం,5 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. అలాగే బీజేపీ 61,జెడియు 71,ఎల్ జేపీ 16,హెచ్ ఏ ఎం 3,ఆర్ ఎల్ ఎం 0, ఆర్జేడీ 64 ,కాంగ్రెస్ 19, వీఐపీ 1, లెఫ్ట్ 3, 3 స్థానాల్లో ముందంజలో జన్ సురాజ్ పార్టీ ఉంది.

  • 14 Nov 2025 09:44 AM (IST)

    మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కనిపిస్తోంది. ప్రస్తుతం 159 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాగర్బంధన్ కూటమి అభ్యర్థులు 71 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యంలో ఉన్నారు. బిహార్ మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు కావాలి. ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది.

  • 14 Nov 2025 09:42 AM (IST)

    ఈ పార్టీలో ఆధిక్యంలో

    ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, బిజెపి 21 స్థానాల్లో, జెడియు 16 స్థానాల్లో, ఆర్జెడి 8 స్థానాల్లో, ఎల్జెపి 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో, సిపిఐ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 14 Nov 2025 09:24 AM (IST)

    ముందంజలో..

    • మీనాపూర్ – అజయ్ కుమార్ ముందంజలో ఉన్నారు
    • మోకామా – అనంత్ సింగ్
    • పూల తోట – శ్యామ్ రజక్ సింగ్
    • మసౌదీ – అరుణ్ మాంఝీ ముందంజలో
    • దర్భంగా సదర్ నుండి సంజయ్ సరోగీ లీడింగ్
    • హిసువా నుంచి బీజేపీ అభ్యర్థి అనిల్ సింగ్ ముందంజలో ఉన్నారు.
  • 14 Nov 2025 09:18 AM (IST)

    ఈ అభ్యర్థులు ముందంజలో..

    • రాజ్‌నగర్ నుంచి సుజీత్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు
    • ఔరాయ్ నుంచి రామ నిషాద్ ముందంజలో ఉన్నారు
    • బారురాజ్ నుంచి అరుణ్ కుమార్ సింగ్ ముందంజలో ఉన్నారు
    • రాజు సింగ్ సాహిబ్‌గంజ్ నుంచి ముందంజలో ఉన్నారు
    • ఢాకా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పవన్ జైస్వాల్ తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు.
    • బనియాపూర్ కేదార్ సింగ్ బీజేపీ ముందంజలో ఉన్నారు
    • కతిహార్ సదర్ నుంచి బిజెపి అభ్యర్థి తార్కిషోర్ ప్రసాద్ 4200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
    • షహబుద్దీన్ కుమారుడు ఒసామా షహబ్ రఘునాథ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుండి ముందంజలో ఉన్నారు.
  • 14 Nov 2025 09:11 AM (IST)

    కౌంటింగ్‌కి కట్టుదిట్టమైన భద్రత

    • బీహార్‌ కౌంటింగ్‌కి కట్టుదిట్టమైన భద్రత
    • ఢిల్లీ బ్లాస్ట్‌ నేపథ్యంలో ముందుజాగ్రత్తలు
    • ఈనెల 16 వరకు ర్యాలీలపై నిషేధం
  • 14 Nov 2025 09:08 AM (IST)

    మేజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే

    బీహార్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే మేజిక్‌ ఫిగర్‌ దాటింది. 120 సీట్లకుపైగా ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. వందకుపైగా సీట్లలో మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 14 Nov 2025 09:05 AM (IST)

    ఎన్డీయే 120 స్థానాల్లో ఆధిక్యం

    EVMలు తెరిచిన వెంటనే కాంగ్రెస్, RJD అద్భుతమైన పునరాగమనం చేశాయి. కాంగ్రెస్ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, RJD 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహా కూటమి విషయానికొస్తే అది 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. NDA 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 14 Nov 2025 09:02 AM (IST)

    ముందంజలో బీజేపీ సభ్యులు

    1. తరారి అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ ముందంజ
    2. జగదీష్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జెడియు ఎంఎల్‌సి శ్రీ భగవాన్ ముందంజ
    3. షాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జెడి ఎమ్మెల్యే రాహుల్ తివారీ ముందంజ
    4. అరా అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సంజయ్ టైగర్ ముందంజ
    5. బెగుసరాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కుందన్ కుమార్ ముందంజ
    6. దానపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రామ్‌కృపాల్ యాదవ్ ముందంజ
    7. పూర్నియా సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి విజయ్ ఖేమ్కా ముందంజ
    8. ధమ్దహా అసెంబ్లీ నియోజకవర్గంలో జెడియు అభ్యర్థి లెస్సీ సింగ్ ముందంజ
    9. బన్మంఖి అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కృష్ణ కుమార్ రిషి ముందంజ
  • 14 Nov 2025 09:02 AM (IST)

    ఆధిక్యంలో NDA

    ట్రెండ్స్ ప్రకారం ఎన్డీయే సంఖ్య 100 దాటింది. అది 110 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మహా కూటమి 77 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ 62 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 58 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

  • 14 Nov 2025 08:50 AM (IST)

    బీహార్‌ ఎన్నికల కౌంటింగ్‌లో వీరు ముందంజలో..

    • తరారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ ముందంజలో ఉన్నారు.
    • జగదీష్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి JDU MLC శ్రీ భగవాన్ ముందంజలో ఉన్నారు.
    • షాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యే రాహుల్ తివారీ ముందంజలో ఉన్నారు.
    • అర్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ టైగర్ ముందంజలో
    • బెగుసరాయ్ నుంచి బీజేపీ అభ్యర్థి కుందన్ కుమార్ ఆధిక్యంలో
    • రాంకృపాల్ యాదవ్ దానాపూర్ నుంచి ముందంజలో
    • పూర్ణియా సదర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ ఖేమ్కా ఆధిక్యంలో ఉన్నారు
    • ధమ్దహా అసెంబ్లీ స్థానం నుంచి జెడియు అభ్యర్థి లేషి సింగ్ ముందంజలో ఉన్నారు.
    • బన్మంఖి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణ కుమార్ రిషి ముందంజలో ఉన్నారు.
    • అమౌర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
    • కస్బా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
  • 14 Nov 2025 08:33 AM (IST)

    లీడింగ్ లో NDA

    బిహార్‌లో పోస్టల్‌ బ్యాలెట్లలో ఎన్డీఏ లీడింగ్‌ కొనసాగుతోంది. అలాగే రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్‌ ముందంజ కొనసాగుతున్నారు. ఇక తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి(BJP) ముందంజ ఉండగా, మహువా నుంచి లాలూ కుమారుడు తేజ్‌ప్రతాప్‌ లీడింగ్‌లో ఉన్నారు.

  • 14 Nov 2025 08:25 AM (IST)

    తేజస్వి ముందంజ

    — బిహార్‌లో మొదలైన పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

    — రాఘోపూర్‌లో తేజస్వి ముందంజ

    — తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి(BJP) ముందంజ

    — మహువా నుంచి లాలూ కుమారుడు తేజ్‌ప్రతాప్‌ లీడింగ్‌

    — మొకామా సీట్‌లో జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ ముందంజ

  • 14 Nov 2025 08:18 AM (IST)

    నిఘా నీడలో లెక్కింపు

    బిహార్‌ అసెంబ్లీ ఎన్నిక కౌంటింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నీడలో లెక్కింపు కొనసాగుతోంది.

  • 14 Nov 2025 08:12 AM (IST)

    బిహార్‌లో మొదలైన పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

    — బిహార్‌లో మొదలైన పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

    — NDA 3 స్థానాల్లో లీడింగ్‌

    — రెండు సీట్లలో ఆర్జేడీ లీడింగ్‌

    — రాఘోపూర్‌లో తేజస్వి ముందంజ

  • 14 Nov 2025 08:01 AM (IST)

    కౌంటింగ్ షురూ..

    బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రారంభం కాగా, ముందుగా బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు.

  • 14 Nov 2025 07:58 AM (IST)

    నితీష్ తప్పుకోవడం ఖాయం : ఆర్జేడీ

    ఓట్ల లెక్కింపుకు ముందే నవంబర్ 18న తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆర్జేడీ ప్రకటించింది. నితీష్ కుమార్, ఎన్డీఏ ఓడిపోవడం ఖాయం అని అన్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. బీహార్‌లోని 243 సీట్లకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో 121 సీట్లకు, రెండవ దశలో 122 సీట్లకు పోలింగ్ జరిగింది.

  • 14 Nov 2025 07:32 AM (IST)

    బీహార్ అసెంబ్లీతో పాటు ఉప ఎన్నికల ఫలితాలు

    బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ ఎనిమిది స్థానాల్లో రాజస్థాన్‌లోని అంటా, జార్ఖండ్‌లోని ఘట్‌శిల, పంజాబ్‌లోని తర్న్ తరణ్, తెలంగాణలోని జూబ్లీ హిల్స్, మిజోరాంలోని డంపా, ఒడిశాలోని నువాపాడా మరియు జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం, నగ్రోటా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటలకు రావడం ప్రారంభమవుతాయి.

  • 14 Nov 2025 06:54 AM (IST)

    కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

    కాసేపట్లో బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపే మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై మాత్రం ఉత్కంఠ నెలకుంది.

Published On - Nov 14,2025 6:48 AM