AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వామ్మో.. జూలో వెళ్తున్న సఫారి వాహనం.. ఒక్కసారిగా దూసుకొచ్చిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

బెంగళూరులోని బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జూలో పర్యాటకులు విహరిస్తున్న సఫారీ వాహనంపై ఒక్కసారిగా ఒక చిరుతపులి దాడి చేసింది. వాహనంలోంచి ఒక మహిళ జంతువులను గమనిస్తుండగా పులి ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో బయపడిపోయిన పర్యాటకులురాలి కొద్దిలో దాని దాడి నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Watch: వామ్మో.. జూలో వెళ్తున్న సఫారి వాహనం.. ఒక్కసారిగా దూసుకొచ్చిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral Video
Anand T
|

Updated on: Nov 14, 2025 | 9:07 AM

Share

జూలో సఫారీ చేస్తున్న పర్యాటకుల వాహనం ఓ చిరుతపులి దాడి చేసిన ఘటన బెంగళూరులోని బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనంలో చోటుచేసుకుంది. చిరుత దాడిలో చెన్నైకి చెందిన ఒక మహిళ స్వల్పంగా గాయపడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (KSTDC) వాహనంలో 10 మందికి పైగా సందర్శకులు పార్క్‌లోని సఫారీ జోన్ గుండా వెళ్తున్నారు. వాహనంలో ఉన్న 50 ఏళ్ల వాహిత్ బాను అనే మహిళ తన భర్త, కుమారుడితో కలిసి వాహనం కిటికీలోంచి పార్క్‌లోని జంతువులను చూస్తుంది.

సరిగ్గా అదే సమయంలో ఒక చిరుతపులి ఊహించని విధంగా బస్సుపైకి దూకింది, ఇది ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. కొద్దిసేపు భయాందోళనకు గురిచేసింది. గందరగోళంలో, వాహిత్ బాను చేతికి చిన్న గాయమైంది. వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది వాహనాన్ని అక్కడి నుంచి సేఫ్‌ ప్లేస్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించారు.

చిరుతపులి ఆకస్మిక దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సఫారీల సమయంలో భద్రతా సూచనలను జాగ్రత్తగా పాటించాలని, వాహనం నుండి బయటకు తల, చేతులు పెట్టరాదని పార్క్ అధికారులు పర్యాటకులను కోరారు. ఇటువంటి సంఘటనలు చాలా అరుదు, చిరుతపులులు స్వతహాగా దూకుడుగా ఉండవని, అవి ఆసక్తిగా లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఇలా ప్రవర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.

గమనిక: ఈ నివేదిక సోషల్ మీడియా నుండి యూజర్లు రూపొందించిన కంటెంట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ వాదనలను మేము స్వతంత్రంగా ధృవీకరించలేదు వాటిని ఆమోదించదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా