AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mettelu: పెళ్లైన స్త్రీల పాదాలకు మెట్టెలు ఎందుకు తొడుగుతారో తెలుసా?

వివాహమైన మహిళల కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం హిందూ సంప్రదాయంలో ఓ ముఖ్యమైన ఆచారం. దీనికి మతపరమైన, సాంస్కృతిక , శాస్త్రీయమైన అనేక కారణాలు ఉన్నాయి. వివాహానికి చిహ్నంగా పరిగణించబడే మెట్టెలు ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి కూడా మెట్టెలు చాలా ముఖ్యమైనవి..

Mettelu: పెళ్లైన స్త్రీల పాదాలకు మెట్టెలు ఎందుకు తొడుగుతారో తెలుసా?
Toe Rings For Women
Srilakshmi C
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 14, 2025 | 7:16 AM

Share

వివాహమైన మహిళల కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం హిందూ సంప్రదాయంలో ఓ ముఖ్యమైన ఆచారం. దీనికి మతపరమైన, సాంస్కృతిక , శాస్త్రీయమైన అనేక కారణాలు ఉన్నాయి. వివాహానికి చిహ్నంగా పరిగణించబడే మెట్టెలు ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి కూడా మెట్టెలు చాలా ముఖ్యమైనవి. అసలు వివాహం జరిగిన మహిళలు మెట్టెలు ఎందుకు ధరించాలి? దీని వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి భారతీయ స్త్రీ వివాహం తర్వాత తన కాళ్ల వేళ్లకు మెట్టెలు ధరిస్తుంది. మెట్లను వివాహానికి చిహ్నంగా భావిస్తారు. ఇది స్త్రీ పదహారు అలంకారాలలో ఒకటి. గ్రంథాల ప్రకారం మెట్టెలు పాదం రెండవ,మూడవ వేళ్ళకు మాత్రమే ధరించాలి. పాదాలకు మెట్టెలు ధరించడం వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుంది. ఇది ప్రతికూల శక్తి నుంచి రక్షణ లభిస్తుంది. ఇది అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. అలాగే వెండి శరీరంలోని వేడిని నియంత్రించే, ప్రతికూల శక్తిని తొలగించే చల్లని లోహంగా పరిగణిస్తారు. అలాగే వెండి చంద్రునితో ముడిపడి ఉంటుంది. వెండి ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గ్రహ అడ్డంకులు తొలగిపోతాయి. బంగారంతో చేసిన ఏదీ ఎప్పుడూ పాదాలకు ధరించకూడదని అందుకే అంటారు. బంగారం విష్ణువుతో ముడిపడి ఉంటుంది. దానిని పాదాలకు ధరించడం అగౌరవంగా పరిగణిస్తారు.

పాదాలకు మెట్టెలు ధరించడానికి శాస్త్రీయ కారణం ఆక్యుప్రెషర్. పాదాల రెండవ లేదా మూడవ వేలుపై మెట్టెలు ధరిస్తే అక్కడి వేళ్లలో ఉండే సిరలు గర్భాశయం, గుండెకు అనుసంధానించబడి ఉంటాయి. ఈ మెట్టెలు ధరించడం వల్ల ఆ సిరలపై తేలికపాటి ఒత్తిడి ఉంటుంది. ఇది సంతానోత్పత్తిని పెంచుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా గర్భం దాల్చడానికి సహాయపడుతుంది. మెట్టెలు వల్ల కలిగే ఈ ఒత్తిడి మహిళల హార్మోన్ల వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ఇది ఋతు చక్రం క్రమం తప్పకుండా ఉంచుతుంది. థైరాయిడ్ వంటి సమస్యల అవకాశాలను తగ్గిస్తుంది. మెట్టెలు ధరించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు మత విశ్వాసాలు, శక్తి సమతుల్యత, మహిళల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఓ ఆచారం. అందుకే వివాహమైన ప్రతి అమ్మాయి తప్పక పాదాలకు మెట్టెలు ధరిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.