Cockroach Control: బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఇవి మీ ఇంట్లో ఉంటే వాటికి దడే..
శీతాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శీతాకాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మన ఇల్లు నీటుగా లేకపోతే మన అనారోగ్యం బారీన పడవచ్చు. దీనితో పాటు ఈ సీజన్‌లో చాలా ఇళ్లలో బొద్దింక బెడద కూడా పెరుగుతుంది. అవి వంటగది, వెచ్చని, తేమ, చీకటి ప్రదేశాలను ఇష్టపడతాయి. దీంతో రాత్రిపూట వీటి బెడద మరింత పెరుగుతుంది. మీ ఇంట్లోనూ ఈ బొద్దింకల సమస్య ఉంటే.. మేం చెప్పబోయే కొన్ని చిట్కాలతో వాటిని ఈజీగా తరిమి కొట్టండి.

ప్రతి ఇంట్లోనూ బొద్దింకలు అనేది ఒక పెద్ద సమస్య. ఇంట్లో ఉండే ఆడవాళ్లు వీటితో విగిసిపోయి ఉంటారు. ఇవి వంటగదిలోకి చొరబడి కిరాణా సామాగ్రిని నాశనం చేస్తాయి. అలాగే మనం తినే ఆహారంపై తిరిగి వాటి మొత్తాన్ని విషపూరితంగా మారుస్తాయి. వీటి బెడదతో విసిగిపోయిన చాలా మంది వాటిని తరిమికొట్టడానికి మార్కెట్లో అనేక స్ప్రేలు వాడుతుంటారు. కానీ ఇవి వాటి సమస్యను పూర్తిగా పరిష్కరించలేవు. కాబట్టి మన ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. మీరు ఈ చిట్కాలను ప్రయత్నిస్తే, మీరు మీ ఇంటిని బొద్దింకలు లేకుండా చేసుకోవచ్చు.
బొద్దింకలను తరిమి కొట్టే ఐదు చిట్కాలు
బేకింగ్ సోడా, చక్కెర: బొద్దింకలను తరిమికొట్టడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి బేకింగ్ సోడా, చక్కెర. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో బేకింగ్ సోడా, చక్కెరను సమాన భాగాలుగా కలపండి. బొద్దింకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో చల్లుకోండి. ఇలా చేయడం ద్వారా బొద్దింకలు అవి తిరిగే ప్రదేశాల నుంచి తక్షణమే వెళ్లిపోతాయి.
బే ఆకు: బొద్దింకలను తరిమికొట్టడానికి బే ఆకులను ఉపయోగించడం కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. బే ఆకుల గాటైన వాసన బొద్దింకలకు ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల బొద్దింకలు ఆ ప్రదేశాలకు రాకుండా ఉంటాయి. ఇందుకోసం మీరు కొన్ని బే ఆకులను తీసుకొని నీటిలో నానబెట్టండి. ఇప్పుడు, బొద్దింకలు ఎక్కడ కనిపించినా ఈ నీటిని చల్లుకోండి. దీనివల్ల అవి పారిపోతాయి.
కిరోసిన్ నూనె: మీ అందరి ఇంట్లో కిరోసిన్ ఉండవచ్చు. దీనితో, మీరు సింక్‌లు లేదా క్యాబినెట్‌లలో దాక్కున్న బొద్దింకలను సులభంగా తరిమికొట్టవచ్చు. కొద్దిగా నీటిని కిరోసిన్‌తో కలిపి బొద్దింకలు స్థావరం ఏర్పాటు చేసుకున్న ప్రదేశాలపై పిచికారీ చేయండి. ఇది బొద్దింకల బెడద నుండి మిమ్మల్ని వెంటనే ఉపశమనం చేస్తుంది.
వెనిగర్: సాధారణంగా బొద్దింకలు ఎక్కువగా మురికిగా ఉండే ప్రదేశాలలో జీవిస్తూ ఉంటాయి. దీనిని ఎదుర్కోవడానికి మీరు వెనిగర్ ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటిలో కొంచెం వెనిగర్ వేసి, ఈ ద్రావణాన్ని బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పిచికారీ చేయండి. ఇది పొంచి ఉన్న బొద్దింకలను తరిమివేస్తుంది .
లవంగాలు: లవంగాలు బొద్దింకలను తరిమికొట్టే ప్రభావవంతమైన నివారణ. వాటి ఘాటైన వాసన వాటిని తరిమికొట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అవి గుంపులుగా ఉన్న చోట కొన్ని లవంగాలను చల్లుకోండి. వాటి వాసన వల్ల అవి మీ ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




