AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారిస్‌లో భారత స్టార్టప్‌ల గర్జన.. ప్రపంచ ఇన్వెస్టర్లకు విద్యా మంత్రిత్వ శాఖ ఆహ్వానం!

భారతదేశానికి చెందిన స్టార్టప్‌లను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సరికొత్త ముందడుగు వేసింది. పారిస్‌లో నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్ 2026' రోడ్‌షో ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జూన్ నెలలో ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో జరగనున్న ప్రధాన ఈవెంట్‌కు ముందు, భారత ఇన్నోవేషన్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కార్యక్రమం సాగింది.

పారిస్‌లో భారత స్టార్టప్‌ల గర్జన.. ప్రపంచ ఇన్వెస్టర్లకు విద్యా మంత్రిత్వ శాఖ ఆహ్వానం!
Bharat Innovates 2026
Ravi Kiran
|

Updated on: May 06, 2026 | 1:36 PM

Share

మనం ఎప్పుడూ వింటూ ఉంటాం.. భారత్ ఇప్పుడు ప్రపంచానికే స్టార్టప్ హబ్ అని. ఆ మాటను నిజం చేస్తూ, భారతీయ విశ్వవిద్యాలయాల్లో పుట్టిన వినూత్న ఆలోచనలను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేయడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ అనే భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ముందుగా, పారిస్‌లో నిర్వహించిన రోడ్‌షో ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ఈ రోడ్‌షో ఒక టీజర్ లాంటిది. భారత రాయబార కార్యాలయం, సీఐఐ సహకారంతో జరిగిన ఈ సమావేశంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ నెట్‌వర్క్‌లు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. భారతదేశంలోని డీప్-టెక్ స్టార్టప్‌లను అంతర్జాతీయ పెట్టుబడిదారులతో అనుసంధానం చేయడమే ఈ రోడ్‌షో ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సందర్భంగా విద్యా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీలు కె.ఎం. ప్రఫుల్లచంద్ర శర్మ, గోవింద్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ముఖ్యంగా సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ వంటి 13 అత్యాధునిక సాంకేతిక రంగాలపై ఈ ఈవెంట్ ఫోకస్ చేయనుంది. గత ఫిబ్రవరిలో భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి ‘భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్’ను ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మన కాలేజీల్లోని ల్యాబ్‌ల నుండి పుట్టిన ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, గ్లోబల్ ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలు నైస్ నగరంలో జరగబోయే సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ రోడ్‌షో ద్వారా భారతీయ స్టార్టప్‌ల శక్తి సామర్థ్యాలపై ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లలో గట్టి నమ్మకం ఏర్పడింది.

Follow Us