AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2026 విజేతపైనే కాదు భయ్యో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లపైనా కాసుల వర్షం..!

IPL 2026 Prize Money: ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, కాసుల కుంభవృష్టి కూడా అని ఈ ప్రైజ్ మనీ వివరాలు చూస్తే అర్థమవుతుంది. మరి ఈ ఏడాది రూ.20 కోట్ల భారీ నజరానాతో పాటు ప్రతిష్టాత్మక ఐపీఎల్ ట్రోఫీని ఆర్‌సీబీ ముద్దాడుతుందా లేక గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంటుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ఐపీఎల్ 2026 విజేతపైనే కాదు భయ్యో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లపైనా కాసుల వర్షం..!
Ipl 2026 Prize MoneyImage Credit source: AI Image
Venkata Chari
|

Updated on: May 31, 2026 | 1:52 PM

Share

IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ గుడారంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మహా సంగ్రామంలో గెలిచి ట్రోఫీని ముద్దాడే విజేతతో పాటు రన్నరప్‌కు దక్కే ప్రైజ్ మనీ, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు బీసీసీఐ అందించే భారీ నగదు బహుమతుల వివరాలు ఓసారి చూద్దాం..

ఐపీఎల్ 2026 ఫైనల్: కోట్లాది రూపాయల కాసుల వేట!

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపునకు వచ్చేసింది. ఈ ఏడాది ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల ఖాతాలోనూ ప్రస్తుతం తలో ఒక్క ట్రోఫీ మాత్రమే ఉంది. ఇప్పుడు రెండో ట్రోఫీని తమ సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా, ఆర్‌సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో గెలిచే విజేతకు, రన్నరప్‌కు దక్కే ప్రైజ్ మనీ ఎంత? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలకు బీసీసీఐ ఎంత ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి: సిగ్గుండాలి.. ఔట్ చేయడం చేతకాక అలాంటి బౌలింగ్ చేస్తారా.. గుజరాత్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ ఫైర్

ఇవి కూడా చదవండి

విజేతకు రూ.20 కోట్లు.. రన్నరప్‌కు రూ.13 కోట్లు..!

ఐపీఎల్ 2026 విజేతగా నిలిచే జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ.20 కోట్ల భారీ నగదు బహుమతిని అందించనుంది. అలాగే ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి. టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన జట్లకు కూడా బీసీసీఐ భారీగానే ఇస్తోంది. క్వాలిఫైయర్ 2లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ.7 కోట్లు దక్కగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో వెనుతిరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.

ఆరెంజ్ క్యాప్ రేసులో 15 ఏళ్ల కుర్రాడు.. పర్పుల్ క్యాప్ కోసం సీనియర్ల పోరు..

ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసు అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710 పరుగులు) అతడికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఫైనల్ ముగిసేసరికి ఎవరికైతే ఆరెంజ్ క్యాప్ దక్కుతుందో వారికి రూ.10 లక్షల నగదు బహుమతి లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్.. టీమిండియా తోపును వెంటాడుతున్న ఆ ‘శాపం’..?

ఇక వికెట్ల వేటలో పర్పుల్ క్యాప్ కోసం సీనియర్ బౌలర్లు పోటీ పడుతున్నారు. గుజరాత్ బౌలర్ కాగిసో రబాడ 16 ఇన్నింగ్స్‌ల్లో 28 వికెట్లతో ముందంజలో ఉండగా, ఆర్‌సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో వెనుకే ఉన్నాడు. ఈ ఇద్దరిలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న బౌలర్‌కు రూ.10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది.

ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు ఎవరికో?

ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ రేసులో వైభవ్ సూర్యవంశీతో పాటు పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య ముందంజలో ఉన్నారు. ఈ అవార్డు సాధించిన యువ ఆటగాడికి బీసీసీఐ రూ.20 లక్షల నగదును బహుమతిగా ఇస్తుంది. అలాగే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎమ్‌వీపీ) రేసులో వైభవ్ సూర్యవంశీ, కాగిసో రబాడ, జోఫ్రా ఆర్చర్ పోటీలో ఉన్నారు. ఈ అవార్డు గెలుచుకున్న వారికి రూ.10 లక్షలు దక్కుతాయి. క్రమశిక్షణతో ఆడిన జట్టుకు ఇచ్చే ఫెయిర్‌ప్లే అవార్డు రేసులో పంజాబ్ కింగ్స్ ముందుంది. ఈ అవార్డు కింద సదరు జట్టుకు రూ.10 లక్షలు లభిస్తాయి. మొత్తంమీద బీసీసీఐ ఈ సీజన్ అవార్డుల కోసం రూ.47.1 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఐపీఎల్ ప్రైజ్ మనీ పూర్తి వివరాలు:

ఛాంపియన్ (విజేత జట్టు) రూ. 20 కోట్లు

రన్నరప్ (రెండో స్థానం) రూ. 13 కోట్లు

క్వాలిఫైయర్ 2లో ఓడిన జట్టు (రాజస్థాన్) రూ. 7 కోట్లు

ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు (హైదరాబాద్) రూ. 6.5 కోట్లు

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ రూ. 20 లక్షలు

ఆరెంజ్ క్యాప్ విజేత రూ. 10 లక్షలు

పర్పుల్ క్యాప్ విజేత రూ. 10 లక్షలు

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎమ్‌వీపీ) రూ. 10 లక్షలు

ఫెయిర్‌ప్లే విజేత జట్టురూ. 10 లక్షలు

ఐపీఎల్ చరిత్రలో ప్రైజ్ మనీ ప్రయాణం:

2008లో ఐపీఎల్ ప్రారంభమైన మొదటి రెండు సీజన్లలో విజేతకు రూ.4.8 కోట్లు మాత్రమే లభించేవి. 2010 నుంచి ఆ మొత్తాన్ని రూ.10 కోట్లకు పెంచారు. ఆ తర్వాత 2014, 2015లో రూ.15 కోట్లుగా ఉన్న ప్రైజ్ మనీని 2016లో రూ.20 కోట్లకు పెంచారు. కరోనా ప్రభావం ఉన్న 2020లో మళ్లీ రూ.15 కోట్లకు తగ్గించినప్పటికీ, 2021 నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా విజేతకు రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని బీసీసీఐ అందిస్తూ వస్తోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us